Dailyhunt
పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు.. ఆరుగురు అధికారులకు ప్రమోషన్

పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు.. ఆరుగురు అధికారులకు ప్రమోషన్

వార్త 2 weeks ago

Panchayat Raj Department: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మల్టీ జోన్-1 పరిధిలోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్1, సీనియర్ అసిస్టెంట్ కేటగిరీలకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు మండల పంచాయతీ అధికారులుగా (ఎంపీవోలు) పదోన్నతి లభించింది.

కొత్త జోనల్ విధానం ప్రకారం 2019-20, 2020-21 ప్యానెల్ సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన రివ్యూ ఆధారంగా ఈ నియామకాలు జరిగాయి. గతంలో జరిగిన ఎంపీవో ప్రమోషన్లపై ఏర్పడిన సందేహాలు, కొత్త లోకల్ క్యాడర్ అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అంతర్గత కమిటీని నియమించింది.

Read Also: Smartphone Electricity Billing: ఇక స్మార్ట్‌ఫోన్‌తోనే కరెంట్ బిల్లుల జారీ!

 Six officers in the Panchayat Raj department promoted to MPOs

Panchayat Raj Department: డీపీసీ నివేదిక, నియామకాలు

ఈ కమిటీ సమర్పించిన రిపోర్టును పరిశీలించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిబంధనల ప్రకారం అర్హులైనవారికి ప్రమోషన్లు ఖరారు చేసింది. నిజామాబాద్ జిల్లాలో గ్రేడ్-1 పంచాయతీ సెక్రటరీగా కొనసాగుతున్న ఏ.గంగాధర్, రజినీకాంత్రెడ్డి, సయ్యద్ మగ్దమ్ అహ్మద్ను మెదక్ జిల్లాకు ఎంపీవోలుగా కేటాయించారు.

నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పి.సాయిలును సిద్ధిపేట, సిద్ధిపేటలో గ్రేడ్-1 పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న మునీరుద్దీన్న మెదక్, వరంగల్ జిల్లాలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న షాజహాన్ ను ములుగుకు కేటాయించారు. పదోన్నతి పొందిన అధికారులు 15 రోజుల్లోగా కొత్త జిల్లాలో విధుల్లో చేరాలని పంచాయతీరాజ్శాఖ ఆదేశించింది. ఈ నియామకాలను అడాక్ ప్రాతిపదికన చేపట్టారు. కోర్టు కేసులు లేదా ఇతర పాలనాపరమైన నిర్ణయాలకు లోబడి ఈ ప్రమోషన్లు ఉంటాయని పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జిల్లా కలెక్టర్‌కు GPOల వినతి.. ఇంక్రిమెంట్ల మంజూరుకు కోరిక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha