Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పండక్కి ఊరెళ్లాలా? ఈ ట్రైన్లలో బెర్తులు ఖాళీ

పండక్కి ఊరెళ్లాలా? ఈ ట్రైన్లలో బెర్తులు ఖాళీ

వార్త 2 weeks ago

SCR Special Trains: దసరా, దీపావళి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే..

ఆయా ట్రైన్లలో అందుబాటులో ఉన్న ఖాళీ బెర్తుల వివరాలను కూడా వెల్లడించింది. అక్టోబర్ 6 నాటికి ఉన్న ఖాళీలను ప్రకటిస్తూ.. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

Telangana: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.12,650 కోట్ల ఆదా

స్పెషల్ ట్రైన్లలో బెర్తులు అందుబాటులో

దసరా, దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభమైంది. కొన్ని రైళ్లలో పండుగ రోజులకు కూడా గణనీయమైన సంఖ్యలో బెర్తులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే వెల్లడించింది.

సికింద్రాబాద్-శ్రీకాకుళం రైలులో భారీగా ఖాళీలు

సికింద్రాబాద్-శ్రీకాకుళం (07425) ప్రత్యేక రైలులో అక్టోబర్ 11న 67 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 18న 228, అక్టోబర్ 25న 611 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 1న 635, నవంబర్ 8న 664, నవంబర్ 15న 656, నవంబర్ 22న 655, నవంబర్ 29న 654 బెర్తులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే తెలిపింది.

చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ (07037) స్పెషల్ ట్రైన్‌లో అక్టోబర్ 6న 386 బెర్తులు, అక్టోబర్ 20న 223 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 27న 634, నవంబర్ 3న 714, నవంబర్ 10న 732, నవంబర్ 17న 730, నవంబర్ 24న 733 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చర్లపల్లి-బెంగళూరు (07065) ప్రత్యేక రైలులో అక్టోబర్ 12న 571, అక్టోబర్ 19న 745, అక్టోబర్ 26న 729 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 2న 762, నవంబర్ 9న 765 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు రైల్వే వెల్లడించింది.

SCR Special Trains: కాకినాడ, తిరువణ్ణామలై రైళ్లలోనూ ఖాళీలు

సికింద్రాబాద్-కాకినాడ (07039) ప్రత్యేక రైలులో అక్టోబర్ 14న 241 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 21న 515, అక్టోబర్ 28న 746, నవంబర్ 4న 770, నవంబర్ 11న 777, నవంబర్ 18న 777 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి-తిరువణ్ణామలై (07003) స్పెషల్ ట్రైన్‌లో అక్టోబర్ 13న 257 బెర్తులు, అక్టోబర్ 20న 656, అక్టోబర్ 27న 701 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 3న 737, నవంబర్ 10న 704, నవంబర్ 17న 742 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

చర్లపల్లి-సెంగొట్టాయ్ (07191), చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ (07021), చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ (07023) ప్రత్యేక రైళ్లలో కూడా పలు తేదీల్లో బెర్తులు అందుబాటులో ఉన్నట్లు రైల్వే వెల్లడించింది. పండుగ సమయంలో చివరి నిమిషంలో టికెట్ల కోసం ఇబ్బంది పడకుండా ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైళ్లలో తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉండటంతో.. ప్రైవేట్ బస్సులపై అధిక మొత్తంలో ఖర్చు చేయకుండా ముందస్తుగా రైలు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

దసరా పండక్కి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. ఇంటి వద్దకే బస్సు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha