Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పండుగ సీజన్ లో పెరుగుతున్న గోల్డ్ రేట్లు

పండుగ సీజన్ లో పెరుగుతున్న గోల్డ్ రేట్లు

వార్త 1 week ago

Hyderabad gold price:హైదరాబాద్‌లో బంగారం ధర పండుగల సీజన్ మొదలవ్వడంతో ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. అక్టోబర్ 5న 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ₹1,49,180 వద్ద ఉండేది.

అక్టోబర్ 11 ఆదివారం నాటికి ఈ ధర ఏకంగా ₹1,51,420 మార్కును చేరింది. ఇలా వారం వ్యవధిలోనే పసిడి ప్రియులకు ₹2,240 మేర షాక్ తగిలింది.

Hyderabad orr speed limit: ఓఆర్ఆర్ వేగ పరిమితి 120 నుంచి 100 కిలోమీటర్లకు?

 Gold prices rising during the festive season.

22 క్యారెట్ల గోల్డ్ రేట్ వివరాలు

ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రారంభంలో ఈ రేటు ₹1,36,750 వద్ద ఉండగా, ప్రస్తుతం ₹1,38,800 వద్ద ట్రేడవుతోంది. అంటే వారం రోజుల్లో ₹2,050 వరకు పైకి చేరింది. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరిన్ని రికార్డులు సృష్టిస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Hyderabad gold price:స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు

బంగారం రేట్లు భారీగా పెరిగినప్పటికీ వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 1 కిలో వెండి ధర ₹2.45 లక్షల వద్ద మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. పండుగల వేళ ఆభరణాలు కొనేవారిపై ఈ పెరిగిన గోల్డ్ రేట్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్‌లో మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు.. హాజరైన ప్రముఖులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha