Hyderabad trains:సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. వినాయక చవితి, దసరా పండుగలకు ట్రైన్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్య దాటి రిగ్రెట్ కు చేరుకుంది.
సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న విజయదశమి పండుగలు రావడంతో ప్రయాణికులు నెల రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో గోదావరి ఎక్స్ ప్రెస్, విశాఖ సూపర్ప్రాస్ట్ వంటి ప్రముఖ రైళ్లలో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. పండుగ రద్దీ కారణంగా వీక్లీ రైళ్లపై కూడా తీవ్ర ప్రభావం పడింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈసారి పండుగ సీజన్ లో రద్దీ భారీగా పెరిగింది.
Read also: Indian Railways Expansion: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు
Heavy rush for train tickets
ప్రత్యేక రైళ్లు కోరుతున్న ప్రయాణికులు
ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేక రైళ్లు ప్రకటించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి రూట్లలో అదనపు సర్వీసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు వస్తుండటంతో కుటుంబాలతో కలిసి ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమయ్యారు. రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ కావడంతో జనరల్ బోగీల్లో కూడా కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తే అధిక ధరలు భరించాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ వెంటనే స్పందించి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ కేటాయించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Hyderabad trains:ప్రయాణికులకు తప్పని తిప్పలు
పండుగ వేళ ప్రయాణ తంటాలు తప్పడం లేదు. ముందస్తు రిజర్వేషన్లు చేసుకోని వారికి ప్రయాణం ఒక పెద్ద పరీక్షగా మారింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని ట్రైన్ జర్నీని ఎంచుకునే మధ్యతరగతి ప్రజలకు ఈ పరిస్థితి తీవ్ర నిరాశను మిగులుస్తోంది. అత్యవసర పనులపై సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు త్వరలోనే కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పండుగ సంతోషంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.
Epaper: epaper.vaartha.com

