Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబ్ మున్సిపల్ పోరులో ఆప్ క్లీన్ స్వీప్..బీజేపీకి ఎదురుదెబ్బ

పంజాబ్ మున్సిపల్ పోరులో ఆప్ క్లీన్ స్వీప్..బీజేపీకి ఎదురుదెబ్బ

వార్త 3 weeks ago

AAP's clean sweep in Punjab municipal elections: పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తిరుగులేని సత్తా చాటింది.

ఇటీవల కాలంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆప్‌ను వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన నేపథ్యంలో ఈ గెలుపు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చింది. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఐదింటిని ఆప్ కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Read Also: Rural Economy India Strategy: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే దేశ ఆర్థిక సుస్థిరతకు పునాది

AAP’s clean sweep in Punjab

ఐదు కార్పొరేషన్లలో ‘ఆప్’ జెండా.. కుప్పకూలిన విపక్షాలు

శుక్రవారం వెలువడిన ఫలితాల ప్రకారం.. రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లలో మొహాలీ, బర్నాలా, బటాలా, మోగా, బటిండాలను ఆప్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా కపుర్తలాలో విజయం సాధించగా, బీజేపీ కేవలం అబోహర్‌ కార్పొరేషన్‌కే పరిమితమైంది. పఠాన్‌కోట్‌లో మాత్రం బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది.

  • మొత్తం 1,977 వార్డులకు గాను ఆప్ రికార్డు స్థాయిలో 954 స్థానాల్లో గెలుపొందింది.
  • కాంగ్రెస్ 390, స్వతంత్రులు 251 స్థానాలు దక్కించుకున్నారు.
  • శిరోమణి అకాలీదళ్ (SAD) 191, బీజేపీ కేవలం 170 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 మున్సిపల్ కౌన్సిళ్లలో 45 చోట్ల ఆప్ జెండా ఎగురవేసి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.

AAP’s clean sweep in Punjab municipal elections: ఇది మా నాలుగేళ్ల అభివృద్ధికి నిదర్శనం: సీఎం భగవంత్ మాన్

ఈ భారీ విజయంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ నాలుగేళ్ల సుపరిపాలనకు, అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన అభివర్ణించారు. ఇదే సమయంలో బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీని 'ఈడీ పార్టీ'గా పేర్కొంటూ.. “కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి మా నేతలను భయపెట్టాలని చూశారు. కానీ పంజాబ్ ప్రజలు ఎవరి బెదిరింపులకు లొంగరని ఈ ఫలితాలతో రుజువు చేశారు” అని అన్నారు. వచ్చే 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ మున్సిపల్ ఫలితాలను చూసి ఆప్ అతిగా సంబరపడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కుల్దీప్ సింగ్ గత చరిత్రను గుర్తు చేస్తూ.. “2021 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది, కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అలాగే 2015లో స్థానిక ఎన్నికల్లో గెలిచిన అకాలీదళ్, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది” అని వివరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha