Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే దేశ ఆర్థిక సుస్థిరతకు పునాది

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే దేశ ఆర్థిక సుస్థిరతకు పునాది

వార్త 3 weeks ago

Rural Economy India Strategy: భారతదేశం భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకుడు చల్లపల్లి వీరయ్య చౌదరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, సహజ వనరుల వినియోగంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నంతకాలం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తాను వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడిని అయినప్ప టికీ పెద్ద ఆర్థికవేత్తను కాదని, దివంగత రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి. రంగా శిష్యరికం వల్ల వ్యవసా య, గ్రామీణ ఆర్థిక అంశాలపై కొంత అవగాహన కలిగిందని తెలిపారు.

Read Also: DK Shivakumar to take oath : జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న డీకే శివకుమార్‌

Rural Economy India Strategy: విదేశీ దిగుమతుల ఒత్తిడి – స్వదేశీ ఉత్పత్తి ఆవశ్యకత

దేశ ఆర్థిక పరిస్థితిని కేవలం రూపాయి-డాలర్ మారక విలువలతోనే అంచనా వేయడం సరైన పద్ధతి కాదన్నారు. విదేశాల నుంచి ఇంధనం, ఎరువులు, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై అధికంగా ఆధారపడటం విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యా లను పెంపొందించడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయడం అవసరమని సూచించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. దేశంలోని సాగు భూమి, ఎరు వుల అవసరాలు, నీటి వనరుల వినియో గంపై సమగ్ర ప్రణాళిక రూపొందించి వ్యవ సాయ ఉత్పత్తిని పెంచాలని సూచించా రు. నదీ జలాల వినియోగాన్ని విస్తరించి, వ్యవసాయ ఉత్పత్తుల పరం గా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవాలని అన్నారు.

విలువ ఆధారిత పరిశ్రమలు – ఎగుమతుల వృద్ధి

దేశంలో లభిస్తున్న వ్యవ సాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత పరిశ్రమలను అనుసంధానం చేయడం ద్వారా ఎగుమతులను పెంచవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల కొరత ఉన్న దేశాలకు ప్రాసెస్డ్ వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకో వచ్చని అభిప్రాయపడ్డారు.

భారత దేశానికి ప్రకృతి ప్రసాదించిన నదీ వ్యవస్థ, వ్యవసాయ అనుకూల వాతావరణం వంటి వనరులను సమర్థంగా వినియోగించు కోవడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వా న్ని సాధించవచ్చన్నారు. కేవలం కరెన్సీ విస్తరణ లేదా తాత్కాలిక ఆర్థిక చర్యల తో దేశ ఆర్థిక సుస్థిరత సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఆర్థిక విధానాలపై ఇప్పుడే ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టమని, 2047 వంటి దీర్ఘకాల లక్ష్యాల సాధనకు మారుతున్న సామాజిక, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులను పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొ న్నారు.

భవిష్యత్తు తరాలు తమ కాలానికి అనుగుణంగా ఆర్థిక విధానాలను రూపొందించుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికీకరణ, సహజ వనరుల సమర్థవినియోగం, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై దృష్టి సారిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవు తుందని చల్లపల్లి వీరయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విశాఖ ఉక్కులో 'టిఒఎంసి' విధానం: ప్రైవేటీకరణ దిశగా అడుగులు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha