Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ విక్టరీ

పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ విక్టరీ

వార్త 1 month ago

PBKS vs RR Match Result: ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరు ముగిసింది.ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) విజయ పరంపరకు రాజస్థాన్ రాయల్స్ చెక్ పెట్టింది.పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత విజయాన్ని అందుకుంది.

పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, వారి అజేయ ప్రస్థానానికి బ్రేక్ వేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Read Also:Virat Kohli: కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం చిన్నారి ఆవేదన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

 PBKS vs RR Match Result 2026

PBKS vs RR Match Result: రాజస్థాన్ ఛేజింగ్ హైలైట్స్

లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో శుభారంభం ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీ తన 100వ టీ20 సిక్సర్‌కు చేరువగా వచ్చి తృటిలో మిస్ అయ్యాడు.చివరలో డొనోవన్ ఫెరీరా మెరుపు హాఫ్ సెంచరీతో పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. శుభమ్ దూబేతో కలిసి కేవలం 30 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు.బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ 3 కీలక వికెట్లు తీసి పంజాబ్ స్కోరును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

PBKS vs RR Match Result: పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 222/4 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్, ప్రియాంక్ష్ ఆర్యలతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మార్కస్ స్టోయినిస్ కేవలం 22 బంతుల్లో 62 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ చివరి 5 బంతుల్లోనే 24 పరుగులు పిండుకున్నాడు.రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయం సరైనదని ఈ విజయం నిరూపించింది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో మొదటి ఓటమిని చవిచూసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం చిన్నారి ఆవేదన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha