Dailyhunt
కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం చిన్నారి ఆవేదన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం చిన్నారి ఆవేదన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

వార్త 1 week ago

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కోహ్లీ అభిమానులను, నెటిజన్లను రెండు వర్గాలుగా విడగొట్టింది.

హోటల్ వద్ద ఆటోగ్రాఫ్ కోసం ఆశగా ఎదురుచూసిన ఒక చిన్నారికి నిరాశే ఎదురైంది.

Read Also: Manu Bhaker vs Cricket Controversy: షూటర్ ను క్రికెట్ గురించి అడుగుతారా? నెటిజన్ల ఫైర్!

Virat Kohli: అసలేం జరిగింది?

సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా, బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్న ఆశతో ఒక చిన్న బాలుడు స్టేడియంలో ఆయనను కలిసేందుకు ప్రయత్నించాడు. రెండు సార్లు కోహ్లీకి దగ్గరగా వెళ్లినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి అధికారులు ఆ బాలుడిని అడ్డుకున్నారు.

కోహ్లీ తన ధ్యాసలో తాను ఉండటంతో ఆ బాలుడిని గమనించలేకపోయారు. తన ప్రయత్నం విఫలం కావడంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి, ఖాళీ చేతులతో వెనుదిరుగుతూ వెక్కివెక్కి ఏడ్చాడు. తీవ్ర అసహనంతో తన చేతిలో ఉన్న బ్యాట్‌ను కింద పడేసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

చైనా చేతిలో చిత్తైన భారత్ - టోర్నీ నుంచి నిష్క్రమించిన పీవీ సింధు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha