Dailyhunt
పంజాబ్ ప్లేయర్‌ను ప్రేమగా హగ్ చేసుకుని పంచ్ ఇచ్చిన ప్రీతి

పంజాబ్ ప్లేయర్‌ను ప్రేమగా హగ్ చేసుకుని పంచ్ ఇచ్చిన ప్రీతి

వార్త 1 week ago

PBKS vs DC: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (PBKS) సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత మైదానంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Pat Cummins: పాట్ కమిన్స్ కొత్త ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తెలుసా?

అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నయా చరిత్ర లిఖించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఢిల్లీ నిర్దేశించిన భారీ టార్గెట్‌ను 6 వికెట్ల తేడాతో ఛేదించి, ఈ సీజన్‌లో తమ ఆరో విజయాన్ని అందుకుంది.

PBKS vs DC: ప్రీతి జింటా 'స్పెషల్' సెలబ్రేషన్స్

విజయం ఖరారు కావడంతో పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే మైదానంలోకి చేరుకున్న ఆమె ఆటగాళ్లందరినీ పేరుపేరునా అభినందించారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన యువ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య వద్దకు వెళ్లిన ఆమె,ప్రియాంష్‌ను ప్రేమగా హత్తుకుని అభినందనలు తెలిపారు.మాటల మధ్యలో సరదాగా ప్రియాంష్ కడుపులో ఒక చిన్న 'పంచ్' ఇచ్చారు. దీనికి ప్రియాంష్ కూడా నవ్వుతూ తమాషాగా స్పందించాడు.

రవిశాస్త్రి అదిరిపోయే కామెంట్రీ!

ఈ దృశ్యాన్ని గమనించిన దిగ్గజ కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించారు. "ఓహ్.. అది నిజంగానే మంచి పంచ్!" అంటూ ఆయన చేసిన కామెంట్ ప్రేక్షకులను మరింత నవ్వించింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ క్రికెట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha