Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాట్ కమిన్స్ కొత్త ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తెలుసా?

పాట్ కమిన్స్ కొత్త ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తెలుసా?

వార్త 2 months ago

Pat Cummins: ఐపీఎల్ 2026 సీజన్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను వణికించిన వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ప్రత్యర్థి జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సైతం ఈ కుర్రాడి ఆట తీరుకు ఫిదా అయిపోయారు.

Read Also:SRH vs RR: రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారణం అదే: కెప్టెన్ రియాన్ పరాగ్

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డ ఈ 15 ఏళ్ల కుర్రాడు, టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు.కేవలం 36 బంతుల్లోనే ఐపీఎల్ కెరీర్లో తన రెండో సెంచరీని పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ 103 పరుగులు చేసి తన ఖాతాలో 12 సిక్సర్లు, 5 ఫోర్లను వేసుకున్నాడు.

“వైభవ్ నా ఫేవరెట్ ప్లేయర్” - పాట్ కమిన్స్

వైభవ్ సూర్యవంశీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పొగడ్తలతో ముంచెత్తాడు. వైభవ్ ఆట చూస్తుంటే చాలా ఫన్‌గా ఉందని, అతని ఆటతీరుకు ముగ్ధుడయ్యానని ప్యాట్ కమిన్స్ చెప్పాడు.”అతని ఇప్పటి నుంచి నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. బంతిని ఎంత బలంగా కొడుతున్నాడో, అతని ఆట చూడటానికి చాలా బాగుంది. అతను ఆడే విధానం కూడా నాకు బాగా నచ్చింది” అని మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్యాట్ కమిన్స్ పొగడ్తలతో ముంచెత్తాడు.

Pat Cummins: ఐపీఎల్ రికార్డుల రారాజుగా వైభవ్

ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి వారు సాధించిన ఘనతలను వైభవ్ చాలా చిన్న వయసులోనే అందుకుంటున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా భారీ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఇంటర్నేషనల్ బౌలర్లనే లెక్కచేయకుండా అతను ఆడుతున్న తీరు భవిష్యత్తు క్రికెట్ స్టార్‌ను తలపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బౌలర్లు ఇక బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయండి.. పరుగుల వరదపై పాట్ కమిన్స్ సెటైర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha