Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌లో బస్సు బోల్తా ..ఆరుగురు మృతి, 21 మందికి గాయాలు

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌లో బస్సు బోల్తా ..ఆరుగురు మృతి, 21 మందికి గాయాలు

వార్త 2 months ago

నంద్‌పూర్ సాహిబ్ నుంచి తిరిగి వస్తుండగా పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌లో భక్తులతో వెళుతున్న బస్సు బోల్తా పడటంతో ఆరుగురు మృతి చెందగా, మరో 21 మంది గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు.

బైసాఖీ పండుగ సందర్భంగా రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్‌లో పూజలు ముగించుకుని ఫతేగఢ్ సాహిబ్‌లోని మెయిన్ మజ్రీ నివాసులైన భక్తులు తిరిగి వస్తుండగా, మంగళవారం రాత్రి సుమారు 10 గంటలకు బస్సీ పఠానాలోని మొరిండా-చున్నీ రోడ్డు ప్రాంతంలోని హిమ్మత్‌పురా సమీపంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపం కారణంగా బస్సు రోడ్డుపై బోల్తా పడిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా ఆరుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారని ఫతేగఢ్ సాహిబ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం… తండ్రి, కొడుకు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha