Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయడంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
పంచాయతీలకు చెల్లించాల్సిన పన్నులను దీర్ఘకాలంగా ఎగ్గొడుతున్న భారీ పరిశ్రమలు, కార్పొరేట్ విద్యాసంస్థలపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
AP Deputy CM Pawan Kalyan
సామాన్యుడికి ఒక న్యాయం.. కార్పొరేట్లకు ఒక న్యాయమా? పవన్ నిలదీత
ఇటీవల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల నుంచి పేరుకుపోయిన పన్ను బకాయిలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read also: Kalyandurgam: బడి పిలుస్తోంది…భవిష్యత్తును తీర్చిదిద్దే పిలుపు.. ఎంఈఓ విజయకుమారి
“గ్రామాల్లోని సామాన్య ప్రజలు తమకు ఉన్న కొద్దిపాటి సంపాదనలోనే ఎంతో నిజాయతీగా, క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నారు. మరి కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న పెద్ద పరిశ్రమలు, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు తమ బాధ్యతలను ఎందుకు విస్మరిస్తున్నాయి? పంచాయతీలకు రావాల్సిన నిధులను ఎందుకు తొక్కిపెడుతున్నాయి?” అని పవన్ కల్యాణ్ అధికారులను సూటిగా ప్రశ్నించారు.
Pawan Kalyan: అలసత్వాన్ని సహించేది లేదు.. చట్టపరమైన చర్యలకు ఉత్తర్వులు
పన్నుల వసూళ్ల వ్యవహారంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా సహించేది లేదని ఉపముఖ్యమంత్రి హెచ్చరించారు. బకాయిలను వసూలు చేయడానికి కఠినమైన నిబంధనలను అమలు చేయాలని సూచించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ పన్నులు చెల్లించని డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

