Adilabad Farmer Suicide: ఆదిలాబాద్ జిల్లాలో ఒక తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాము పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినా, అధికారులు సకాలంలో లోడ్ చేయకపోవడంతో ఒక జొన్న రైతు తీవ్ర మనస్తాపానికి గురై పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగురే పాండురంగ్ (48) అనే రైతుకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఈ ఏడాది ఆయన తన భూమిలో జొన్న పంటను సాగు చేయగా, సుమారు 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పండిన పంటను అమ్ముకునేందుకు పాండురంగ్ మే 23న సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘సిరిసంపద కొనుగోలు కేంద్రానికి’ తీసుకువచ్చారు. అక్కడ అధికారులు జొన్నలను తూకం వేసి, లాట్ నంబర్ కూడా కేటాయించారు.
Farmer commits suicide by consuming pesticide at the procurement center after failing to sell his crop.
Adilabad Farmer Suicide: మనస్తాపంతో మార్కెట్ యార్డులోనే పురుగులమందు తాగి..
కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా, అధికారులు ఇప్పటివరకు ఆ జొన్న లోడ్‌ను మిల్లులకు లేదా గోదాములకు తరలించలేదు. దీంతో తన పంట ఎక్కడ పాడైపోతుందోనని, చేతికి డబ్బులు అందడం లేదని పాండురంగ్ తీవ్ర మానసిక ఆందోళనకు, మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సిరికొండ మార్కెట్ యార్డులోనే ఆయన పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
రైతు పాండురంగ్ పురుగులమందు తాగడాన్ని గమనించిన చుట్టుపక్కల తోటి రైతులు హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ ఎస్సై విక్రమ్ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. రైతు మృతితో పొన్న గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

