Sanchita Ugale Suicide Case: సినిమాలు, సీరియల్స్ ద్వారా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి కేసులో ఇప్పుడు ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది.
తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ చాట్‌లు వెలుగులోకి రావడంతో.. సంచితా మరణానికి ముందు అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
చిన్న వయసులోనే సినీరంగంలో తనదైన ముద్ర వేయాలని ఆశించిన సంచితా ఉగలే.. కొన్నాళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమె ఒక వైద్యుడి వద్ద క్రమం తప్పకుండా చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే, ఈ క్రమంలోనే ఆమె తన ఇంట్లోని గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే నటి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also : Pakistan: పాకిస్థాన్ పోలీసుల కాల్పుల్లో ఆస్ట్రేలియా చిన్నారి మృతి
Sanchita Ugale’s WhatsApp chats!
Sanchita Ugale Suicide Case: ఇండస్ట్రీ ఒత్తిడే కారణమా?
సంచిత మరణం తర్వాత అనేక ఆరోపణలు వినవస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని సంచిత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొందరు ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడం వల్లే కుంగిపోయిందని అంటుండగా.. ఆమె తండ్రి మాత్రం తన కూతురు మరణంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. చనిపోవడానికి ముందు ఆమె కొందరి వల్ల నిరంతర వేధింపులకు గురైందని, బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా లోపల పూర్తిగా కుంగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సైకాలజిస్ట్‌తో చాటింగ్ వైరల్.. బయటపడ్డ నిజాలు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచితా ఉగలే, ఆమె సైకాలజిస్ట్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ల స్క్రీన్ షాట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ లీకైన చాట్‌ల ప్రకారం.. సంచిత తన భవిష్యత్తు గురించి తీవ్రమైన భయం, ఆందోళనతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. షూటింగ్ సమయంలో డైలాగ్‌లను గుర్తుంచుకోవడంలో కూడా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, మునుపటిలా ప్రవర్తించలేకపోతున్నానని డాక్టర్‌తో స్వయంగా చెప్పుకుంది. వైద్యుడు ఆమెకు ధైర్యంగా ఉండాలని సలహా ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆమె మానసిక స్థితిలో మార్పు రాలేదని ఈ చాట్స్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ లీకైన చాట్‌లను ఆధారంగా చేసుకుని కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

