Dailyhunt
పంత్‌కు కెప్టెన్సీ వద్దు.. మార్‌క్రమ్‌కు పగ్గాలు ఇవ్వండి: వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్

పంత్‌కు కెప్టెన్సీ వద్దు.. మార్‌క్రమ్‌కు పగ్గాలు ఇవ్వండి: వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్

వార్త 1 week ago

టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నో జట్టులో సమూల మార్పులు చేయాలని, ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ను తప్పించాలని ఆయన సూచించారు.

Read Also:Rishabh Pant: ఓటమిపై రిషబ్ పంత్ ఎమోషనల్ కామెంట్స్

జాఫర్ సూచించిన ‘విన్నింగ్’ ఫార్ములా

లక్నో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 6 ఓటములు) ఉండటంపై జాఫర్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో లక్నో పుంజుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి,నేను గనుక లక్నో కోచింగ్ స్టాఫ్‌లో ఉంటే.. వెంటనే రిషబ్ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఎయిడెన్ మార్‌క్రమ్‌కు పగ్గాలు అప్పగిస్తాను. పంత్‌కు కెప్టెన్సీ సెట్ కాదు” అని జాఫర్ కుండబద్దలు కొట్టారు.

 Wasim Jaffer on LSG Captaincy

బ్యాటింగ్ ఆర్డర్ మార్పు

  1. ఓపెనర్లు: ఎయిడెన్ మార్‌క్రమ్ మరియు మార్కస్ స్టోయినిస్.
  2. వన్ డౌన్ (No.3): నికోలస్ పూరన్.
  3. నాల్గవ స్థానం (No.4): రిషబ్ పంత్.

పంత్ కేవలం బ్యాటర్‌గానే ఉండాలి!

రిషబ్ పంత్ అసాధారణ ఆటగాడు అనడంలో సందేహం లేదు, కానీ కెప్టెన్సీ ఒత్తిడి అతని సహజ సిద్ధమైన ఆటను దెబ్బతీస్తోందని జాఫర్ అభిప్రాయపడ్డారు.”పంత్‌ను కేవలం ఒక బ్యాటర్‌గానే చూడాలి. అప్పుడు అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు. కెప్టెన్సీ భారం అతనిపై వేయడం వల్ల జట్టుకు, అతనికి కూడా నష్టం జరుగుతోంది” అని జాఫర్ విశ్లేషించారు.

Wasim Jaffer: చివరి స్థానంలో లక్నో

ఐపీఎల్ 2026 సీజన్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఒక పీడకలలా సాగుతోంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆ జట్టు, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో జాఫర్ చేసిన సూచనలు మేనేజ్‌మెంట్ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సాక్షి ధోనీ చేతికున్న వాచ్ ధరతో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనొచ్చు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha