Telangana Agriculture: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఖరీఫ్‌లో 36 శాతం వృద్ధి – దేశంలోనే ద్వితీయ స్థానంలో తెలంగాణ
ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ రబీ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పంట మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్) విధానం కారణంగా, ఈ ఖరీఫ్ సీజన్‌లో పప్పుధాన్యాల సాగు ఏకంగా 36 శాతం పెరిగినట్లు ఆయన తెలిపారు. ఈ విశేష పురోగతితో తెలంగాణ దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Telangana Agriculture: వ్యవసాయాభివృద్ధికి కేంద్రం సహకారం కోరిన మంత్రి తుమ్మల
రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించేందుకు కూరగాయల సాగు విస్తీర్ణాన్ని లక్ష ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా, రాష్ట్రంలోని కరువు పీడిత మండలాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. ఆయిల్‌పామ్ రైతులకు భద్రత కల్పించేలా ధరల స్థిరీకరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నూతన సాంకేతికత మరియు ప్రాజెక్టులకు మద్దత
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను జోడించే క్రమంలో ‘శాటిలైట్ సాయిల్ హెల్త్ టెక్నాలజీ’ అమలుకు కేంద్రం సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. రైతుల సౌలభ్యం కోసం మరిన్ని అదనపు కృషి విజ్ఞాన కేంద్రాలను (కేవీకే) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కొడంగల్ ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం తరఫు నుంచి పూర్తి స్థాయి ఆర్థిక, విధానపరమైన మద్దతు లభించాలని ఆయన ఆకాంక్షించారు.
Epaper: epaper.vaartha.com

