Parawada Fire Accident: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (JNPCE) లో బుధవారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మాసిటీలోని 'శ్రీ సాయి చందన' (Sri Sai Chandana) పరిశ్రమలో మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read Also:Electricity Charges : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు

Parawada Fire Accident: ప్రమాదానికి గల కారణాలు
పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్-2 (Production Block-2) లో ఉన్న రియాక్టర్ వద్ద ఒక్కసారిగా కెమికల్స్ (రసాయనాలు) లీక్ అయ్యాయి. రసాయనం లీక్ కావడంతో రియాక్టర్ వద్ద భారీ శబ్దంతో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోపల ఉన్న కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Department) పలు ఫైర్ టెండర్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్‌లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఆస్తి నష్టం ఎంత అనే వివరాలపై యాజమాన్యం మరియు అధికారులు అంచనా వేస్తున్నారు. పరవాడ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

