Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరీక్షల వేళ సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు

పరీక్షల వేళ సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు

వార్త 2 weeks ago

NEET PG Exam 2026: హైదరాబాద్‌లో నీట్ పీజీ-2026 (NEET PG-2026) పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం రోజున ఆంక్షలు విధించారు.

ఈ మేరకు అదనపు పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు ఆదివారం ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు అమల్లో ఉంటాయి.

Read Also :Telangana Anganwadi Recruitment 2026: రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు, అర్హతలు ఇవే!

ఆంక్షలు & మార్గదర్శకాలు

పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం విధించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలు జరగకుండా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ కేఫ్‌లు, సైబర్ కేఫ్‌లను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

NEET PG Exam 2026: మినహాయింపులు

ఈ ఆంక్షల నుంచి కింద తెలిపిన వారికి మినహాయింపు ఇచ్చారు:

  • విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది
  • విద్యాశాఖ/పరీక్షా నిర్వహణ సిబ్బంది
  • అంతిమ యాత్రలు (Funeral processions)

పరీక్షార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

రాయదుర్గంలో ఎకరం భూమి ధర రూ. 269 కోట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha