Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పర్యావరణానికి పూడ్చలేని నష్టం చేస్తున్న మోదీ సర్కార్​: రాహుల్ గాంధీ

పర్యావరణానికి పూడ్చలేని నష్టం చేస్తున్న మోదీ సర్కార్​: రాహుల్ గాంధీ

వార్త 1 week ago

Rahul Gandhi On Nicobar: అండమాన్ నికోబార్ దీవులలో తాను పర్యటించినట్లు తెలిపిన రాహుల్ గాంధీ, అక్కడ దట్టమైన అడవులను, పగడపు దిబ్బలను, అద్భుతమైన పర్యావరణాన్ని కళ్లారా చూశానని అన్నారు.

అయితే ప్రస్తుతం అక్కడ ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎప్పటికీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 160 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చెట్లను నరికివేయనున్నారు. ఇది దేశ రాజధాని దిల్లీ కంటే నాలుగు రెట్లు పెద్దది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన, సున్నితమైన ఈ పర్యావరణ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అక్కడి స్థానిక గిరిజనుల నుంచి, సామాన్యుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోందని రాహుల్ మండిపడ్డారు.

Read Also: Two fire accidents in Noida : నోయిడాలో రెండు అగ్నిప్రమాదాలు..తప్పిన ప్రాణనష్టం

 Rahul Gandhi On Nicobar:

పగడపు దిబ్బల విధ్వంసం.. వందలాది పులులను చంపడంతో సమానం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల దెబ్బతినే పగడపు దీవుల (Coral Reefs) గురించి రాహుల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర జీవవైవిధ్యాన్ని, కార్బన్‌ను పీల్చుకునే పగడాల సామర్థ్యాన్ని ఈ భారీ నిర్మాణాలు సర్వనాశనం చేస్తాయని హెచ్చరించారు. “నికోబార్​లోని పగడపు దిబ్బలను నాశనం చేయడం అంటే, భారతదేశంలో వందలాది పులులను చంపేయడంతో సమానం. భారతదేశానికి ఎంతో విలువైన జీవ వనరును వారు పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారు. ఇది పులుల సంరక్షణ కోసం చేపట్టిన ‘ప్రోజెక్ట్ టైగర్’ను నాశనం చేయడంతో సమానం.” అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం (FRA) నిబంధనలను ఉల్లంఘిస్తూ, స్థానిక ప్రజలను కనీసం సంప్రదించకుండానే ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని ఆరోపించారు.

Rahul Gandhi On Nicobar: ‘దేశ రక్షణ కోసం కాదు.. ఒక్క వ్యాపారవేత్త హోటళ్ల కోసం!’

ఈ ప్రాజెక్టును దేశ రక్షణ ప్రాజెక్టుగా మోదీ ప్రభుత్వం రంగు పూస్తోందని, కానీ అది పచ్చి అబద్ధమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొట్టిపారేశారు. భారత్ ఇప్పటికే కేరళలోని ప్రధాన భూభాగంలో ఒక ట్రాన్స్​షిప్​మెంట్​ పోర్టును నిర్మిస్తోందని, అలాంటప్పుడు ఈ దీవుల్లో మరో భారీ పోర్టు అవసరం లేదన్నారు. నిజమైన కారణాన్ని బయటపెడుతూ.. “ఒకే ఒక్క వ్యాపారవేత్త అక్కడ హోటళ్లు, క్యాసినోలు నిర్మించడం కోసం ఏకంగా 1.5 కోట్ల చెట్లను నరికేస్తున్నారు. అధికారిక మ్యాపుల నుంచి పగడపు దిబ్బల గుర్తులను చెరిపేస్తున్నారు. దేశ రక్షణలో పాల్గొన్న మాజీ సైనికులను, గిరిజనులను వారి స్థానాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు” అని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. రక్షణ రంగంపై అంతగా ప్రేమ ఉంటే గత ఐదేళ్లుగా నావికాదళం కోరుతున్న ఐఎన్​ఎస్​ బాజ్ (INS Baaz) నౌకాదళ స్థావరాన్ని ఎందుకు విస్తరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా స్పందిస్తూ.. ఈ గ్రేట్ నికోబార్​ పోర్టు త్వరలోనే ప్రధాని మోదీ, అదానీ సామ్రాజ్యంలో భాగం కానుందని (‘మోదానీ’ సామ్రాజ్యం) ఆరోపించారు. మన సైనిక మౌలిక సదుపాయాలకు ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదని, క్యాంబ్​బెల్​ బేలో ఉన్న ఐఎన్​ఎస్ బాజ్​ను విస్తరిస్తేనే వ్యూహాత్మక సామర్థ్యాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మే నెలలో రికార్డు స్థాయిలో UPI పేమెంట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha