Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పర్యవేక్షణలోపమే కల్తీ పాలు లకు ప్రధాన కారణం

పర్యవేక్షణలోపమే కల్తీ పాలు లకు ప్రధాన కారణం

వార్త 2 months ago

Food adulteration : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఫలితంగా కల్తీ పదార్థాలు మార్కెట్లో విచ్చల విడిగా పుట్టుకొస్తున్నాయి.

దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఫుడ్సేఫ్టీ అధికారులు సేకరించిన ప్రతీ వంద షాంపిల్స్లో 20కి పైగా కల్తీకి గురైనట్లు నివేదికలు చెబుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో పార్లమెంటుకు నివేదించిన అహార కల్తీలే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీగా ఆహార పదార్థాలు, సరుకుల కల్తీలు జరుగుతోన్నా నియం త్రణకు తీసుకున్న చర్యలు నామమాత్రమే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ వైద్య ఆరోగ్య శాఖకు అత్తెసరు నిధులే కేటాయించిన విషయం తెలిసిందే. బడ్జెట్ లో రెండు శాతమే కేటాయించినా ఇందులో ప్రజారోగ్యశాఖ పరిధిలో ఫుడ్సేఫ్టీ విభాగం ఊసే లేకుండా పోయింది. ఆహార కల్తీ నిర్ధారణకు ల్యాబ్ల విస్తరణ, సిబ్బంది నియా మకం లేనట్లేనని తేలింది.

Read Also :Amaravati High Speed Rail: అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్

 Food adulteration

Food adulteration : వైద్య ఆరోగ్య శాఖకు అత్తెసరు నిధులే

ఏపీలో తిరుపతి లడ్డు, పాల కల్తీ దూమారం రేపుతున్న విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్ మోమోస్ మయోనైజ్ తినడం వల్ల మృతి చెందిన సంఘటనలున్నాయి. తెలంగాణాలోనూ రోజూ ఎక్కడో చోట ఆహార కల్తీలతో అనారోగ్య పాలౌతున్నారు. తరచూ విద్యా సంస్థల్లోని స్టూడెంట్స్ ఫుడ్ పాయిజ్కు గురై ఆసుపత్రి పాలౌతున్నారు. మార్కెట్లో రోజు తినే వస్తువులు, పదార్థాలు కల్తీయా, నాసిరకమా? అనేది తెలియడంలేదు. ఎక్కువగా కల్తీపదార్థాలు తయారు చేస్తున్నట్లు స్పష్టమోతుంది. పసుపు, కారం, ధనియాలు, పప్పులు, నూనెలు ఇలా నిత్యవసర సరుకులతోపాటు ఇతర వస్తు వుల్లో కల్తీ జరుగుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో స్పష్టమోతుంది. అరటిపండ్లలో ఇథోపాన్ పెస్టిసైడ్, ఆపిల్ పై ప్యారాపిన్, సపోట, దానిమ్మ, సంత్ర వీటిల్లో కార్బడ్ అవశేషాలుంటున్నాయి. కన్ఫెక్షనరీలో పల్లిపట్టిలో సల్ఫర్ డైయాక్సైడ్, కురు, చాక్లెట్స్ స్వీట్స్హౌజ్ లడ్డు, జిలేబీ, కేక్లలో విచ్చలవిడిగా కలర్స్ వినియోగిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ తో పాటు లివర్ సంబంధిత వ్యాధులు కబళిస్తున్నాయి. ఇక ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వినియోగించే ఆయిల్, కలర్స్, ముడి పదార్థాల గురించి చెప్పనవసరం లేదు.

 Food adulteration

అన్నీ చిదంబర రహస్యాలే

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ను గుర్తించే ఒకే ల్యాబ్ ఉంది. ప్రతీ రోజు కొన్ని మాత్రమే టెస్ట్ చేసేందుకు వీలుంది. రాష్ట్రంలోని 33జిల్లాలకు వందలోపు ఫుడ్ సేఫ్టీ అధికారులు, సిబ్బందిమాత్రమే ఉన్నారు. సుమారుకోటిన్నర జనాభా గల హైదరాబాద్లో 32 సర్కిళ్లలో ఉన్న అరకొర సిబ్బంది వల్ల తనిఖీలు ఏమాత్రం చేయవచ్చో అర్థంచేసుకో వచ్చు. రాష్ట్రానికి ఆరు ఎఫ్ఎస్ఎస్ఎస్ఐల్యాబ్లు, మరో ఆరు మోబైల్ ల్యాబ్లు మంజూరు చేయాలని కేంద్రానికి తెలం గాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీనివల్ల తనిఖీలు, షాంపిల్స్ సేకరణ పరిమితంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. దుకాణాలు, ఆహార ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీ ఇలా అన్నీఇక్కడ చిదంబర రహస్యాలే. ఆహారపదార్థాల తయారీ దారులు, హోటళ్ల యజమానులు, ఇతర దుకాణాదారులు దరఖాస్తులను జీఎఫ్ ఐ పరిశీలించి రిజిస్ట్రేషన్, లైసెన్సులు జారీచేయాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అహార పదార్థాల కల్తీల నియంత్ర ణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-చిలగాని జనార్థన్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ యుద్ధంతో భారత ఫారెక్స్ రిజ్వర్వులపై భారీ ప్రభావం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha