Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశ్చిమగోదావరిలో బోటు ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన 7 మత్స్యకారులు

పశ్చిమగోదావరిలో బోటు ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన 7 మత్స్యకారులు

వార్త 3 weeks ago

West Godavari Boat Accident: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద తీవ్ర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను తీవ్రంగా ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ప్రమాద సమయంలో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు అలల ఉధృతికి నీటిలో పడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారు సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించారు.

Read Also : Suryapet Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

 Boat accident in West Godavari; 7 fishermen fell into the sea.

West Godavari Boat Accident: గ్రామస్తుల అప్రమత్తత.. తప్పిన పెను ప్రమాదం

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కేకలు విన్న చిన్నలంక గ్రామస్తులు వెంటనే స్పందించారు. ఆలస్యం చేయకుండా నీటిలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టడంతో ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను చిన్నలంకలోని పునరావాస కేంద్రానికి తరలించారు.

కాకినాడకు చెందిన వేటగాళ్లుగా గుర్తింపు

బాధితులంతా కాకినాడ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సుమారు ఏడు రోజుల క్రితం కాకినాడ రేవు నుంచి బయలుదేరిన వీరు, సముద్రంలో వేట సాగిస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. గ్రామస్తుల సమయానుకూల స్పందనతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తి వివరాల సేకరణకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha