Suryapet Road Accident: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని పేర్కొన్న ఆయన, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Pawan Kalyan shocked by Suryapet road accident.
Suryapet Road Accident: క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు
ఈ ప్రమాదంలో గాయపడిన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పవన్ కళ్యాణ్, క్షతగాత్రులందరికీ తక్షణమే మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మెరుగైన చికిత్స కోసం తెలంగాణ రాష్ట్ర అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఏపీ అధికారులకు సూచించారు.

