Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పసిడిలా మెరుస్తున్న పసుపు.. క్వింటా రూ.19 వేలు

పసిడిలా మెరుస్తున్న పసుపు.. క్వింటా రూ.19 వేలు

వార్త 0 months ago

Turmeric price:మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంటకు భారీ ధర లభించింది. సోమవారం జరిగిన ఈ-వేలంలో వ్యాపారులు పోటీపడి పసుపును కొనుగోలు చేశారు.

ఈ మార్కెట్ పరిధిలోని కేసముద్రం పసుపు ధర రికార్డు. క్వింటాకు ఏకంగా 19 వేల రూపాయల మార్కును దాటింది. కొద్దిరోజుల కిందటితో పోలిస్తే ఒక్కసారిగా వేల రూపాయల వ్యత్యాసం రావడంతో స్థానిక రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Rice Prices: బియ్యం ధరలకు రెక్కలు.. కిలో సన్న బియ్యం రూ.100!

 Turmeric prices surge in Kesamudram market

ఈ-నామ్ వేలంలో రికార్డు స్థాయి పసుపు ధరలు

ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ విధానం ద్వారా పారదర్శకంగా వ్యాపారం నిర్వహించారు. ఈ వేలంలో కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా 19,253 రూపాయలు కాగా, సగటున 19,252 రూపాయలు పలికింది. అలాగే గోళరకం పసుపు గరిష్ఠంగా 18,566 రూపాయలు సగటున 17,469 రూపాయల ధర పొందింది. కేవలం ఏడుగురు రైతులు తెచ్చిన కాడిరకం 69 బస్తాలు, ముగ్గురు రైతులు తెచ్చిన గోళరకం 30 బస్తాలకు ఈ ఆశించిన స్థాయి ఆదాయం సమకూరింది.

Turmeric price:నాణ్యత పెరగడంతో రైతులకు చేతికి భారీ లాభాలు

గత మార్కెట్ వేలంతో పోలిస్తే ఈసారి క్వింటాకు సుమారు 6 వేల రూపాయల వరకు అదనంగా లభించింది. రెండు రోజుల విరామం ముందు వరకు క్వింటా పసుపు 13,319 రూపాయలు మాత్రమే ఉండేది. ఈసారి రైతులు మార్కెట్ కు తీసుకువచ్చిన పంట నాణ్యత అత్యుత్తమంగా ఉండడంతో వ్యాపారులు ఎక్కువ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేశారు. సరైన సమయంలో నాణ్యమైన పంటను విక్రయానికి తేవడం వల్లనే తమకు మంచి లాభం వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

హమ్మయ్య.. తగ్గుతున్న కూరగాయల రేట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha