Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పట్టాల పంపిణీలో నారా లోకేశ్ .. మంగళగిరిలో 7.30 గంటల కార్యక్రమం

పట్టాల పంపిణీలో నారా లోకేశ్ .. మంగళగిరిలో 7.30 గంటల కార్యక్రమం

వార్త 2 weeks ago

Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన 'మన ఇల్లు - మన లోకేశ్' కార్యక్రమం స్థానికంగా ఎంతో కోలాహలంగా సాగింది.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మొదటిరోజే 1,331 మంది అర్హులైన పేద లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టాలను అందజేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ పంపిణీ ఘనంగా నిర్వహించారు.

ఏడున్నర గంటల పాటు నిరంతరాయంగా పంపిణీ

ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ఈ పట్టాభిషేక మహోత్సవం సాయంత్రం 5:00 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగింది. ఈ సుదీర్ఘ సమయంలో మంత్రి నారా లోకేశ్ దాదాపు ఏడున్నర గంటల పాటు ఓపికగా నిలబడే ఉండటం విశేషం. వచ్చిన ప్రతి లబ్ధిదారుడితో ఆప్యాయంగా మాట్లాడుతూ, స్వయంగా పట్టా పత్రాలను వారి చేతుల్లో పెట్టారు.

Nara Lokesh: లబ్ధిదారులకు నూతన వస్త్రాల బహుకరణ

ఇళ్ల పట్టాలతో పాటు లబ్ధిదారులందరికీ మంత్రి నారా లోకేశ్ నూతన వస్త్రాలను కూడా కానుకగా బహూకరించారు. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, సుదీర్ఘ సమయం పాటు ఓపిగ్గా ప్రజాసేవలో నిలబడటాన్ని చూసి అక్కడి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు.

షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం.. ఫోన్ చేసి పరామర్శించిన నారా లోకేశ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha