Balakrishna Injury: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'NBK111' సినిమా చిత్రీకరణలో ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడలో జరుగుతున్న షూటింగ్‌లో బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైంది.
ఈ విషయం తెలుసుకున్న ఆయన అల్లుడు, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించి, బాలకృష్ణకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. “బాలా మావయ్య త్వరగా కోలుకోవాలి” అని ఆయన ఆకాంక్షించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా బాలకృష్ణ, మంచు మనోజ్‌ల మధ్య ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ క్రమంలో బాలకృష్ణ మోకాలి కండరం చిరగడంతో (మజిల్ టియర్) వెంటనే చిత్రబృందం ఆయనను ఆసుపత్రికి తరలించింది.
Read Also : Balakrishna Injured: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Balakrishna injured during shoot; Nara Lokesh calls to inquire about his well-being.
Balakrishna Injury: చిన్న శస్త్రచికిత్స అవసరం
ఆసుపత్రిలో బాలకృష్ణను పరీక్షించిన వైద్యులు, మోకాలి గాయానికి ఒక చిన్న శస్త్రచికిత్స అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. అయితే అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాలయ్య క్షేమంగానే ఉన్నారని చిత్ర బృందం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బాలకృష్ణ త్వరగా కోలుకుని తిరిగి పూర్తి ఫామ్‌తో షూటింగ్‌లో పాల్గొనాలని నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్లాక్‌బస్టర్ 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కథానాయకగా నయనతార నటిస్తున్నారు.

