Actor Mansoor Ali Khan: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు అభ్యర్థులు వినూత్న ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన హంగామా ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారల ప్రభావం ఎప్పుడూ ఎక్కువే. ఈసారి విజయ్ (TVK) వంటి స్టార్లతో పాటు మన్సూర్ అలీఖాన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మన్సూర్ ఆలీఖాన్ ఇండియన్ డెమొక్రాటిక్ టైగర్స్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి సోమవారం నామినేషన్ వేశారు. ద్రవిడ ఉద్యమాలకు కేంద్రమైన లాల్గుడిని ఆయన పోటీకి ఎంచుకోవడం చెప్పుకోదగ్గ అంశం.
Read Also:Nayanthara: ఐదు భాషల్లో సినిమాలతో లేడీ సూపర్ స్టార్ బిజీ బిజీ
Mansoor Ali Khan Lalgudi Nomination
Actor Mansoor Ali Khan: ఆరు నెలల ఎదురుచూపు.. డీఎంకే హ్యాండ్!
తనకు సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (DMK), పళనిసామి (AIADMK)లను కోరినప్పటికీ, వారు నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.అనంతరం మన్సూర్ అలీఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు అన్నాడీఎంకే, డీఎంకేలు సీటు నిరాకరించాయని, పళనిసామి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్‌ను కలిసి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరానని అన్నారు. కానీ, వారు సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఇక, మంగళవారం నుంచి లాల్గుడి ప్రాంతంలో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో కల్లక్కుడి రైల్వేస్టేషన్‌కు వెళ్లిన అకస్మాత్తుగా పట్టాలకు అడ్డంగా తలపెట్టుకొని పడుకోవడం కలకలం రేగింది.
ఆ సమయానికి అటుగా రైలు రాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఆయన మాత్రం తనకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గుర్తుకు రావడంతో పట్టాలపై పడుకున్నానని చెప్పడం గమనార్హం. గతంలో ఇదే కల్లక్కుడిలో హిందీ రుద్దుడుకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి సరిగ్గా ఇలాగే పట్టాలపై తలపెట్టి నిరసన తెలిపారు.గుర్తు తెచ్చుకుంటూ: “ఆ రోజు కరుణానిధి గారు చేసిన ఆ గొప్ప పోరాట చరిత్ర గుర్తొచ్చి, నేను కూడా ఇక్కడ పడుకున్నాను” అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యానించారు. తన ఎన్నికల ప్రచారానికి ఆ పోరాట స్ఫూర్తినే పునాదిగా మార్చుకున్నానని ఆయన తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

