Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ రైలు

పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ రైలు

వార్త 3 weeks ago

Vande Bharat Sleeper:దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవల విస్తరణ వేగంగా కొనసాగుతోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో, సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతోంది.

సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లలో ఉన్న ప్రత్యేకతలు, వేగం కారణంగా వీటి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి.

Flex Fuel : ఫ్లెక్స్ ఫ్యూయల్తో ఇంధన స్వావలంబన సాధ్యమేనా?

 Launch of Bengaluru-Mumbai Vande Bharat Sleeper Express

బెంగళూరు – ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ఇప్పటికే హౌరా-కామాఖ్య మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుండగా, తాజాగా మరో కొత్త వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు మరియు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ముంబై మధ్య ఈ స్లీపర్ రైలు రాకపోకలు సాగించనుంది.

రైళ్ల రాకపోకల సమయాలు

  • బెంగళూరు నుంచి ముంబైకి (ట్రైన్ నంబర్ 27652): సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో సాయంత్రం 7:45 నిమిషాలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు ముంబైకి చేరుకుంటుంది.
  • ముంబై నుంచి బెంగళూరుకు (ట్రైన్ నంబర్ 27651): మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి 8:10 నిమిషాలకు ముంబైలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

Vande Bharat Sleeper:హాల్ట్ స్టేషన్ల వివరాలు (ఏపీ మీదుగా ప్రయాణం)

బెంగళూరు-ముంబై మార్గంలో ఈ రైలుకు మొత్తం 8 స్టేషన్లలో మాత్రమే హాల్ట్ సౌకర్యం కల్పించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు, కర్ణాటకలో మూడు, మహారాష్ట్రలో మూడు స్టేషన్లు ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్: బెంగళూరు నుంచి బయలుదేరే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఆ తర్వాత అనంతపురంలో ఆగుతుంది. దీని తర్వాత గుంతకల్లులో హాల్ట్ సౌకర్యం ఉంది.
  • ఇతర రాష్ట్రాలు: ఈ రెండు స్టేషన్ల అనంతరం రాయచూరు, యాద్గిర్, కలబురగి (కర్ణాటక), అలాగే షోలాపూర్, పూణె, కల్యాణ్ (మహారాష్ట్ర) స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

Epaper: epaper.vaartha.com

వేగంగా ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha