AP PMAY Urban houses:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై అర్బన్-2.0 పథకం కింద ఏపీలో పట్టణ ప్రాంత ఇళ్ళు లేని పేదల కోసం కొత్తగా 17,912 గృహాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఈ గృహాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర కూటమి సర్కార్ చొరవతో ఇల్లు లేని పేదవారికి ఈ శుభవార్త అందింది. దీనికోసం రూ.447.80 కోట్లు విడుదల చేస్తూ అధికారికంగా పరిపాలనా అనుమతులు జారీ చేయడం జరిగింది.
Read also: Vijayawada Gudivada Railway: విజయవాడ-గుడివాడ రైలు ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్!
Good news for the urban poor who do not own homes.
ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.89 లక్షల ఆర్థిక సాయం
ఈ పథకం కింద ప్రతి ఇల్లు కట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.50 లక్షల నిధులు సమకూరుస్తాయి. ఇందులో కేంద్రం వాటాగా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటాగా రూ.1 లక్ష ఇస్తాయి. అంతేకాకుండా వీబీ జీరాంజీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ నిర్మాణానికి మరో రూ.12 వేలు అదనంగా జమ అవుతాయి. మొత్తంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో రూ.2.89 లక్షల ఆర్థిక సాయం నేరుగా జమ చేయబడుతుంది. అయితే నిబంధనల ప్రకారంగా నిర్మాణం పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు అందుతాయి.
AP PMAY Urban houses:జిల్లాల వారీగా గృహాల కేటాయింపు
మొత్తం మంజూరైన 17,912 ఇళ్లలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 15,793 ఇళ్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 2,119 ఇళ్లు ఉన్నాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాకు 1,387 ఇళ్లు రాగా, పశ్చిమ గోదావరి జిల్లాకు అత్యల్పంగా 212 ఇళ్లు కేటాయించారు. జిల్లా కలెక్టర్లు స్వయంగా నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. ప్రతి ఇంటి కార్పెట్ ఏరియా కనీసం 30 చదరపు మీటర్ల నుండి గరిష్ఠంగా 45 చదరపు మీటర్ల వరకు ఉండాలి. ప్రభుత్వమే ప్రత్యేక నమూనా డిజైన్లను అందుబాటులో ఉంచనుంది.
Epaper: epaper.vaartha.com

