Vijayawada Gudivada Railway: విజయవాడ - గుడివాడ రైల్వే మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఎట్టకేలకు తీవ్ర ఊరట లభించింది. దశాబ్దాలుగా సింగిల్ లైన్ కారణంగా ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు చెక్ పెడుతూ, రూ.
కోట్లాది వ్యయంతో నిర్మించిన డబుల్ లైన్ (రెండు ట్రాక్‌లు) పనులు పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
Read Also :AP Local Body Elections: ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం.. కమిషన్ గడువు పొడిగింపు

Vijayawada Gudivada Railway: మారిన ప్రయాణ సమయాలు & నూతన సదుపాయాలు
గతంలో సింగిల్ లైన్ ఉండటం వల్ల ఎదురుగా వచ్చే రైళ్ల కోసం ఔటర్లలో గంటల తరబడి (ముఖ్యంగా రాత్రి వేళల్లో) నిలిపివేసేవారు. ప్యాసింజర్ రైలులో 3 గంటలకు పైగా, ఎక్స్‌ప్రెస్ రైలులో గంటన్నర సమయం పట్టేది. డబుల్ లైన్ అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం MEMU రైళ్లు 1 గంటలో, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేవలం 45 నిమిషాల్లోనే విజయవాడ నుంచి గుడివాడకు చేరుకుంటున్నాయి. డబుల్ లైన్ పూర్తి కావడంతో గుడివాడ, మచిలీపట్నం, నరసాపురం, భీమవరం, నిడదవోలు వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో అదనపు కోచింగ్ టెర్మినళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సరుకు రవాణా రైళ్లను పెంచి ఆదాయం పెంపొందించుకోవాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. హాల్టింగ్‌ల గోల లేకుండా వేగంగా, సాఫీగా గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు.. ఢిల్లీలో పురస్కారం అందుకున్న DRP!

