Indiramma Housing Scheme : తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. సొంత ఇల్లు లేని పట్టణ పేదల కోసం హౌసింగ్ బోర్డు ద్వారా డబుల్ బెడ్‌రూమ్ (2BHK) తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా 'ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ' పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. పట్టణాల్లో స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి, నిరుపేద కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద ఎత్తున పక్కా గృహాలు సమకూరనున్నాయి. నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేలాది మంది పేదలకు ఈ పథకం ఒక వరంగా మారనుంది.

జాప్యం లేని అనుమతులు: సింగిల్ విండో విధానం మరియు ఫీజుల మినహాయింపు
ఈ ప్రతిష్టాత్మక హౌసింగ్ స్కీమ్‌ను ఎటువంటి అడ్డంకులు లేకుండా, వేగంగా లబ్ధిదారులకు చేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇళ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ‘సింగిల్ విండో కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా దరఖాస్తుదారులకు అన్ని రకాల అనుమతులు అతి తక్కువ సమయంలోనే లభించనున్నాయి. దీనితో పాటు పేదలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు.. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్లానింగ్ ఛార్జీలు, బిల్డింగ్ పర్మిషన్ ఫీజుల నుంచి ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాలతో అనుమతుల్లో అవినీతికి తావులేకుండా ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగనుంది.
ఇంతటి క్రూరత్వమా! రూ.20 కోసం వృద్ధుడిని గొడ్డలితో నరికి చంపిన కిరాతకుడు!

