Rebbena Murder Case: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మసాడి సోమయ్య (65) అనే వృద్ధుడు తన కూతురిని రైలు ఎక్కించడం కోసం రెబ్బెన రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. కూతురు రైలు ఎక్కిన తర్వాత, ఆయన కాసేపు టీ తాగుదామని స్టేషన్ బయటకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో బోగారపు నగేష్ అనే వ్యక్తి సోమయ్యను సమీపించి, ఖర్చుల కోసం రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని సోమయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.
Read Also : Sangareddy road accident: లూనాను ఢీకొన్న వాహనం.. వృద్ధుడు మృతి
Elderly man brutally murdered for Rs 20!
Rebbena Murder Case: గొడ్డలితో వెంబడించి.. తల మొండెం వేరు చేసి..
డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నగేష్ కక్షగట్టాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సోమయ్యను గొడ్డలితో వెంబడించాడు. క్షణికావేశంలో ఊగిపోయిన నిందితుడు, సోమయ్యపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడి ఎంత ఘోరంగా సాగిందంటే.. వృద్ధుడి తల, మొండెం వేరైపోయేలా నరికేశాడు. ఈ అమానుష దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, జనం గుమిగూడటంతో నిందితుడు నగేష్ అక్కడి నుంచి అడవుల్లోకి పరారయ్యాడు.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు బోగారపు నగేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేవలం రూ.20 కోసం ఒకరి ప్రాణం తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

