పత్తి సాగు చేసే రైతులు తరచుగా ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మార్కెట్ ధరల అస్థిరత. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కనీస మద్దతు ధర (MSP)ని ప్రకటిస్తున్నప్పటికీ, మార్కెట్లో వ్యాపారులు అంతకంటే తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తుండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్రం ‘పీఎం-ఆశ’ (PM-AASHA) పథకం కింద PDPSను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా, రైతు తన పంటను మార్కెట్ యార్డులో అమ్ముకున్నప్పుడు వచ్చే ధర.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే, ఆ వ్యత్యాసాన్ని నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది.
Read Also : Phil Salt IPL Runs: ఫిల్ సాల్ట్ ఊచకోత..సిక్సర్ల సునామీ

తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్: ఎలా పని చేస్తుంది?
ఈ వినూత్న పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను ఎంపిక చేయడం విశేషం. దీని పనితీరు చాలా సరళంగా ఉంటుంది: ఉదాహరణకు, కేంద్రం క్వింటాల్ పత్తికి రూ. 7,500 మద్దతు ధర ప్రకటించింది అనుకుందాం. కానీ మార్కెట్లో రైతుకు కేవలం రూ.6,500 మాత్రమే లభిస్తే, ఆ మిగిలిన రూ.1,000 లోటును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ (DBT) పద్ధతిలో జమ చేస్తుంది. దీనివల్ల రైతు తన పంటను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకున్నా, ఆర్థికంగా ఎటువంటి నష్టం కలగదు.
రైతులకు కలిగే ప్రయోజనాలు
ఈ పథకం అమలులోకి వస్తే, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. మార్కెట్ ఒడిదుడుకుల నుండి రక్షణ లభించడంతో పాటు రైతులకు ఆదాయ భద్రత పెరుగుతుంది. అయితే, ఈ లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ (e-Crop) బుకింగ్‌లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మార్కెట్ యార్డుల్లో అమ్ముకున్నప్పుడు పొందే రశీదులను భద్రపరుచుకోవాలి. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర వాణిజ్య పంటలకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

