Anna Konidela: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
''పవన్ తన జీవితంలో శారీరక నొప్పి కంటే తీవ్రమైన ఎన్నో భారాలను, కష్టాలను మోశారు. ఎంతటి బాధ ఉన్నా ఎప్పుడూ ఫిర్యాదు చేయని ఆయన, ఆ నొప్పి భరించలేని స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే తన బాధను బయటపెడతారు'' అని అన్నా కొణిదెల భావోద్వేగంగా పేర్కొన్నారు.
Read Also: Chandrababu Naidu: భారత ఆర్చరీ టీమ్ విజయానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
Pawan Kalyan's wife Anna shares an emotional post about his health.
Anna Konidela: పరామర్శించిన సీఎం చంద్రబాబు.. నా బాధ్యత అదేనన్న అన్నా
ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోను అన్నా కొణిదెల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా పవన్ ఆరోగ్యంపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు నా పని ఒక్కటే.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవడం, ఆయనకు సురక్షితంగా ఉన్నారనే నమ్మకం కల్పించడం. ఒక్కో రోజు ముందుకు సాగుతూ ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు అని ఆమె రాసుకొచ్చారు.
కోలుకోవడానికి 4 నెలల సమయం!
పవన్ కల్యాణ్‌కు జులై 11న ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన రోటేటర్ కఫ్‌లోని సుప్రాస్పినేటస్, ఇన్‌ఫ్రాస్పినేటస్ టెండన్లకు తీవ్ర గాయం కావడంతో పాటు భుజం ఎముకలో ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దేశంలోనే ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ దిన్‌షా పార్దీవాలా నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వేగంగా కోలుకుంటున్నారని, కొంత విశ్రాంతి అనంతరం ప్రత్యేక రిహాబిలిటేషన్ (ఫిజియోథెరపీ) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వైద్యులు తెలిపారు. భుజం పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సుమారు నాలుగు నెలల సమయం పడుతుందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Epaper: epaper.vaartha.com

