Pooja Hegde: కొంతకాలంగా సరైన సక్సెస్ లేక టాలీవుడ్‌లో వెనుకబడిన 'బుట్టబొమ్మ' పూజా హెగ్డేకు ఒక అదిరిపోయే లక్కీ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే భారీ ఛాన్స్ ఆమెను వరించినట్లు సామాజిక మాధ్యమాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది.

దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓజీ 2’ రూపకల్పనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
మెగా ఛాన్స్.. పూజా హెగ్డేకు స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అవుతుందా?
గతంలోనే పవన్ కల్యాణ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు, క్రిష్ జాగర్లమూడి పీరియాడిక్ మూవీలోనూ మొదట పూజా హెగ్డే పేరును పరిశీలించారు. కానీ, అప్పట్లో డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆ అవకాశాలు చేజారాయి.
ప్రస్తుతం వరుస పరాజయాలతో రేసులో వెనుకబడిన పూజా హెగ్డేకు, ఒకవేళ 'ఓజీ 2' వార్త నిజమైతే మాత్రం కెరీర్‌కు ఊపిరిపోసే గ్రాండ్ కమ్‌బ్యాక్ లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

