Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇడుపు కాయితం' టైటిల్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్

'ఇడుపు కాయితం' టైటిల్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్

వార్త 3 weeks ago

Idupu Kaitham Title Controversy: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi), నాగదుర్గ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఇడుపు కాయితం" (Idupu Kaitham).

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సంయుక్త సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద భాషా వివాదం నడుస్తోంది. ఈ చిత్ర టైటిల్‌ను ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు హేళన చేస్తూ ట్రోల్ చేయడంతో.. ఇది కాస్తా ఏపీ వర్సెస్ తెలంగాణ (AP vs Telangana) భాషా యుద్ధానికి దారితీసింది.

Read Also:Idupu Kayitham Movie Controversy: 'ఇడుపు కాయితం' టైటిల్‌పై వివాదంపై స్పందించిన నటుడు నరేష్

 Garikapati Narasimha Rao on Telangana dialect

సినిమా పేరు ప్రకటించిన తర్వాత కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో.. 'ఇదేం భాష? అసలు ఇది తెలుగేనా?.. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తారా?' అని, సినిమా చూడటానికి సబ్‌టైటిల్స్ కావాలంటూ వెటకారంగా పోస్టులు పెట్టారు. దీంతో తెలంగాణ మేధావులు, నెటిజన్లు, భాషాభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడిచినా.. ఇంకా తెలంగాణ అచ్చతెలుగు యాస, భాషలపై కొందరికి చులకన భావం పోలేదని మండిపడుతున్నారు.

ట్రోలర్ల నోళ్లు మూయిస్తున్న ప్రవచనకర్త గరికపాటి పాత వీడియో!

ఈ భాషా వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో.. గతంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు (Garikapati Narasimha Rao) తెలంగాణ భాషా విశిష్టతపై చేసిన వ్యాఖ్యల తాలూకు పాత వీడియోను తెలంగాణ నెటిజన్లు ప్రస్తుతం విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఏపీ ప్రాంతానికి చెందిన ట్రోలర్లకు గరికపాటి మాటలతోనే గట్టి బుద్ధి చెబుతున్నారు.

ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ..

"తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకు (Classical Telugu) చాలా దగ్గరైన భాష. వ్యాకరణం తెలిసిన వారు నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. తెలంగాణలో వాడే 'చేసిన్రు' అనే పదం పద్యాల్లో వచ్చే 'చేసినారు'కు రూపాంతరమే. తెలంగాణ భాష ఎంతో శాస్త్రీయమైనది. ఇక్కడి భాష ఇంకా గ్రాంథిక రూపంలోనే ఉండటానికి ప్రధాన కారణం ఆంగ్లేయ (English) ప్రభావం తక్కువగా ఉండటమే. బ్రిటీషర్లు ఆ రోజుల్లో సర్కార్ జిల్లాల్లో ప్రవేశించి అక్కడి భాషను, ఆచారాలను మార్చేశారు. నోరు విప్పితే ఇంగ్లీష్ తప్ప తెలుగు లేకుండా చేశారు. కానీ తెలంగాణలో అచ్చమైన తెలుగు పదాలు అలాగే భద్రంగా ఉన్నాయి" అని స్పష్టం చేశారు. ఈ వీడియో కింద తెలంగాణ నెటిజన్లు 'భలే చెప్పిండ్రు గురువు గారు.. తెలంగాణ భాష గురించి బరాబార్ మాట్లాడిన్రు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Idupu Kaitham Title Controversy: అసలు 'ఇడుపు కాయితం' అంటే ఏమిటి?

ట్రోల్స్ చేస్తున్న వారికి తెలంగాణ భాషా పండితులు ఈ పదం వెనుక ఉన్న అర్థాన్ని వివరిస్తున్నారు. 'ఇడుపు కాయితం' అనేది అచ్చమైన తెలంగాణ గ్రామీణ వ్యవహారిక పదమని వారు చెబుతున్నారు. పాత కాలంలో భార్యాభర్తలు మనస్పర్థల కారణంగా కలిసి బతకలేమని నిర్ణయించుకున్నప్పుడు.. కోర్టుల చుట్టూ తిరగకుండా, గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పరస్పర అంగీకారంతో విడిపోవడానికి రాసుకునే 'విడాకుల పత్రాన్ని' (Divorce Document) తెలంగాణ పల్లెల్లో 'ఇడుపు కాయితం' అని పిలుస్తారు. 'ఇడిసిపెట్టడం' (వదిలిపెట్టడం) అనే పదం నుంచే ఈ 'ఇడుపు' అనే పదం పుట్టిందని, ఇది అత్యంత సహజమైన తెలుగు పదమని నెటిజన్లు వివరిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

'సోల్జర్ 24×7 ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్ విడుదల!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha