KTR wishes Pawan Kalyan speedy recovery: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. "పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుంటున్నాను" అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also:TamilNadu Elections: తమిళనాడులో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం
KTR wishes Pawan Kalyan speedy recovery: అసలేం జరిగింది?
కాగా, పవన్ కల్యాణ్‌కు శనివారం (ఏప్రిల్ 18) సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన శాఖకు సంబంధించిన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఆయన ఇబ్బందిపడుతున్నారు. దీంతో పవన్ వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు.
వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి శస్త్రచికిత్స చేశారు. వా నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు.అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం పవన్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

