Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్జాస్ స్టీల్ ప్లాంట్ మా కన్నతల్లి లాంటిది

అర్జాస్ స్టీల్ ప్లాంట్ మా కన్నతల్లి లాంటిది

వార్త 2 months ago

Kakarla Ranganath: తాడిపత్రి మండలం చల్లవారిపల్లె సమీపంలో ఉన్న అర్జాస్ స్టిల్స్ ప్లాంట్ మా గ్రామాలకు కన్నతల్లి లాంటిదని ఫ్యాక్టరీకి నష్టం చేకూరే పనులు మా జీవితంలో చేయడం జరగదని టిడిపి నాయకులు కమ్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రంగనాథ పేర్కొన్నారు.

స్థానిక నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పై తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు ఫిర్యాదు చేశామన్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. అర్జాస్ స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల గ్రామాలకు కన్నతల్లి లాంటిదన్నారు. ప్లాంట్ పై పొల్యూషన్ ఫిర్యాదు చేశామన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు పొల్యూషన్‌పై ఇప్పటివరకు ఏ అధికారికైనా ఫిర్యాదు చేయలేదని, తాము ఫిర్యాదు చేసినట్లు నిరూపిస్తే కాంట్రాక్టు వదులుకునేందుకు సిద్ధమన్నారు.

Read Also :Kalyandurgam: జల సంరక్షణ మన అందరి బాధ్యత: అధికారుల పిలుపు

Kakarla Ranganath: తాడిపత్రిలో ప్రశాంతతను కాపాడడంలో నేను మొదటి స్థానంలో ఉంటాన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశామన్నారు. ఉపాధి కోసం ముందుకు వచ్చిన వారి దరఖాస్తులను మాత్రమే కంపెనీకి అందజేశామన్నారు గత 10-12 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని కోరడం జరిగిందన్నారు- ప్లాంట్‌కు నష్టం తీసుకురావాల్సిన అవసరం నాకు లేదని,నాకు కాంట్రాక్ట్ కావాలంటే ఇతర రాష్ట్రాల్లో చేసుకుని సత్తా ఉందన్నారు.ప్లాంట్‌లో టెండర్లు సిస్టం అమలు చేయాలని కోరానని తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మీ మొబైల్‌లోనే జనగణన నమోదు చేసుకోండి.. ఆర్డీఓ కేశవ నాయుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha