Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. క్యాబినెట్ భేటీలో ఏం జరిగింది?

పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. క్యాబినెట్ భేటీలో ఏం జరిగింది?

వార్త 1 week ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం.. అమరావతిలో జరుగుతున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థత కారణంగా ఉన్నట్లుండి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డారని, దీంతో ఆయన మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చిందని సమాచారం.

Read also: Vijayawada News: ఏపీ అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 Pawan Kalyan is unwell.. What happened in the cabinet meeting?

Pawan Kalyan: క్యాబినెట్ భేటీలో ఏం జరిగింది?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో ఏపీ క్యాబినెట్ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. పలు కీలక నిర్ణయాలు, ఎజెండాలపై మంత్రులందరితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే, సమావేశం జరుగుతుండగానే ఆయన పాత వెన్నునొప్పి సమస్య మళ్లీ తీవ్రం కావడంతో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆందోళనలో జనసేన శ్రేణులు

పవన్ కల్యాణ్‌కు గతంలోనూ ఎన్నికల ప్రచారాలు, వారాహి యాత్రల సమయంలో తీవ్రమైన వెన్నునొప్పి ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా క్యాబినెట్ భేటీ నుంచి ఆయన అస్వస్థతతో వెనుతిరిగారనే వార్త బయటకు రావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారా లేదా ? దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha