Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్‌పై ట్వీట్లు.. రాహుల్ రామకృష్ణపై మండిపడ్డ బీజేపీ నేత మాధవీలత!

పవన్ కళ్యాణ్‌పై ట్వీట్లు.. రాహుల్ రామకృష్ణపై మండిపడ్డ బీజేపీ నేత మాధవీలత!

వార్త 2 months ago

Madhavi Latha: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.

ఒక అభిమానిగా ప్రశ్నిస్తున్నానంటూ.. ఆర్భాటాలు పక్కన పెట్టి పంచాయతీరాజ్ నిధుల లెక్కలు చెప్పాలంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఇప్పటికే తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంలోకి నటి, బీజేపీ నేత మాధవీలత ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ రామకృష్ణ వైఖరిని తప్పుపడుతూ ఆమె అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Read Also : Tadipatri news: తాడిపత్రిలో బీడీ కార్మికులకు ఇంటి పట్టాల పంపిణీ

Tweets about Pawan Kalyan… BJP leader Madhavi Latha lashes out at Rahul Ramakrishna!

Madhavi Latha: ‘ఆజాద్ కాశ్మీర్’ సిద్ధాంతంలా మీ ప్రవర్తన ఉంది!

రాహుల్ రామకృష్ణ కేవలం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి అవ్వరని.. కానీ ఆయన ధోరణి చూస్తుంటే భయం వేస్తోందని మాధవీలత వ్యాఖ్యానించారు. గతంలో ఆజాద్ కాశ్మీర్ పేరుతో కొందరు భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయాలని చూశారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా తెలంగాణ పేరుతో అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఆంధ్రావాళ్లు ఉండకూడదు, మార్వాడీలు ఉండకూడదు, అందరూ వెళ్లిపోవాలి.. మీరు ఒక్కరే మిగలాలా? తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగమనే విషయం మర్చిపోవద్దు అంటూ ఆమె మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి అనే విషయాన్ని రాహుల్ గమనించాలని మాధవీలత హితవు పలికారు. కేవలం పబ్లిసిటీ కోసమే రాహుల్ ఈ విధమైన ట్వీట్లు చేస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కోసమే రాహుల్ రామకృష్ణ ఇలా మాట్లాడుతున్నారని, తెలంగాణవాదం పేరుతో జనాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “నీకు అంతగా ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉంటే.. ముందు నీ సొంత రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఇక్కడి పంచాయతీరాజ్ మంత్రి ప్రజలకు ఏం చేశారో అడుగు. గతంలో తెలంగాణ కోసం పోరాడిన వారికి వెన్నుపోటు పొడిచిన లీడర్లను ప్రశ్నించు. అప్పుడు నువ్వు నిజాయితీపరుడివి అవుతావు” అని సవాల్ విసిరారు.

పవన్ కళ్యాణ్ ఏపీకి దొరికిన ఆణిముత్యం

పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన నాయకుడని, ఆయన ఎలాంటి భూకబ్జాలు చేయరని, ఎవరి సొమ్ము తినరని మాధవీలత స్పష్టం చేశారు. “రాజకీయాల్లో చట్టాలు, రాజ్యాంగ పరిధులు, అధికారులు సహకరించినంత మేర పవన్ కళ్యాణ్ అద్భుతంగా పనిచేయగలరు. ఆయన నియోజకవర్గ ప్రజలకు, ఏపీ ప్రజలకు ఆయన ఏం చేస్తున్నారో బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు దొరికిన ఒక ఆణిముత్యం. ఒకవేళ ఆయన తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే.. ఇక్కడి ప్రజలకు కూడా ఒక మంచి నాయకుడు దొరికినట్లే” అని కొనియాడారు. అందరికీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉద్దెరగా దొరికారని, వేరే ఏ నాయకుడినీ ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ఆమె ఎద్దేవా చేశారు. పవన్‌ను అడిగే ప్రశ్నలేవో సొంత రాష్ట్రంలో ఉన్న మంత్రులను అడిగితే బాగుంటుందని రాహుల్ రామకృష్ణకు గట్టిగా హితవు పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రెండు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ దరఖాస్తు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha