Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత ఫైర్

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత ఫైర్

వార్త 1 week ago

Pawan Kalyan: నటుడు ప్రకాశ్ రాజ్ వైఖరిపై తెలంగాణ జనసేన నాయకుడు సాగర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీ విధానాలను, అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు.

ఇటీవల ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు సాగర్ అంతే ఘాటుగా బదులిచ్చారు.

‘సమయపాలన లేని వ్యక్తివి.. నువ్వా మమ్మల్ని విమర్శించేది?’

జనసేన ఎన్నికల వ్యూహాలపై ప్రకాశ్ రాజ్ మాట్లాడటాన్ని సాగర్ తప్పుపట్టారు. “జనసేన ఒంటరిగా వెళ్తుందా లేక కూటమితో సాగుతుందా అనేది మా అంతర్గత విషయం. దాంతో ఆయనకేం సంబంధం? అసలు ప్రకాశ్ రాజ్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు” అని కొట్టిపారేశారు. ప్రశాంతమైన వాతావరణంలో లేనిపోని వివాదాలు సృష్టించడం ప్రకాశ్ రాజ్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు.

Read also: Bolla Brahmanaidu: గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్

సినిమా రంగంలో ప్రకాశ్ రాజ్ ప్రవర్తనను ప్రస్తావిస్తూ.. “కనీసం షూటింగ్‌లకు సమయానికి వచ్చే అలవాటు ఉందా? మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా చెప్తారు” అంటూ ఎద్దేవా చేశారు.

Pawan Kalyan: తెలంగాణకు ప్రకాశ్ రాజ్ ఏం చేశారు?

దివంగత ప్రజా గాయకుడు గద్దర్ అంశంపై స్పందిస్తూ.. గద్దర్‌ను తామెప్పుడూ వాడుకోలేదని సాగర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌తో గద్దర్‌కు ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో, ఆయన నుంచి నేరుగా ఆర్థిక సహాయం పొందేంత చనువు ఉండేదని స్వయంగా గద్దరే గతంలో చెప్పారని గుర్తుచేశారు.

తెలంగాణ సమాజానికి ప్రకాశ్ రాజ్ చేసిన సేవ ఏంటని సాగర్ నిలదీశారు. “తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కానీ మీ పాత్ర ఉందా? మీ కుటుంబాలు ఏమైనా త్యాగాలు చేశాయా?” అని ప్రశ్నించారు. ఏ ప్రాంతంతోనూ సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల రాజకీయాల్లో తలదూర్చడం ప్రకాశ్ రాజ్‌కు అలవాటుగా మారిందని సాగర్ విమర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha