Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ సమక్షంలో జనసేనలోకి గడల శ్రీనివాసరావు

పవన్ సమక్షంలో జనసేనలోకి గడల శ్రీనివాసరావు

వార్త 1 week ago

Janasena: తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

కరోనా సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రజలకు సుపరిచితుడైన ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

 Janasena Expansion Telangana

Read also: Mrigasira Karthi 2026: జూన్ 8న మృగశిర కార్తె.. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చేరిక జరగడం గమనార్హం. జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్ నివాసంలో డాక్టర్ గడల శ్రీనివాసరావుకు ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తమ కుటుంబాల మధ్య దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న పవన్.. ప్రజాసేవ పట్ల గడలకున్న నిబద్ధత జనసేనకు తెలంగాణలో మరింత విశ్వసనీయతను, బలాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Janasena: భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు: డాక్టర్ గడల

జనసేనలో చేరడంపై డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఇది ఆవేశంలోనో, భావోద్వేగంతోనో తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. నేటి యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా నడిపించగల సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్‌లో ఉన్నాయని, అందుకే తాను జనసేనను ఎంచుకున్నానని తెలిపారు. తెలంగాణలో పార్టీని గ్రామస్థాయికి బలంగా తీసుకెళ్లేందుకు శ్రమిస్తానని ఆయన వెల్లడించారు.

బీఆర్ఎస్ టికెట్ ఆశించి.. జనసేన వైపు!

గడల శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణంపై గతంలోనూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కొత్తగూడెం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ (BRS) తరపున పోటీ చేయాలని ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తన తదుపరి రాజకీయ అడుగులపై హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది.

జనసేనకు పొలిటికల్ బూస్టర్ దొరికినట్లేనా?

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. గడల చేరిక కేవలం ఒక సాధారణ చేరిక మాత్రమే కాదు. తెలంగాణలోని వైద్య, ఉద్యోగ, మధ్యతరగతి వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా జనసేన తన సామాజిక పునాదిని విస్తరించుకోవాలని చూస్తోంది. తెలంగాణలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు ఈ పరిణామం ఏ మేరకు కలిసి వస్తుందో రానున్న రోజుల్లో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి.. రెండ్రోజుల పర్యటన షెడ్యూల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha