Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు

పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు

వార్త 3 weeks ago

Kunamneni Sambasiva rao: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

 Telangana Politics

Read also: Telangana: తెలంగాణ మా అయ్యల జాగీరు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్

“కమ్యూనిజం ఎప్పటికీ సజీవమే”

తన తండ్రి, తాను కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్లమని పవన్ కల్యాణ్ తరచూ చెప్పుకుంటారని గుర్తు చేసిన కూనంనేని, మరి ఇప్పుడు ఆ సిద్ధాంతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భవిష్యత్తులో జనసేన పార్టీ కనుమరుగైనా కావచ్చు కానీ, కమ్యూనిజం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మం, కమ్యూనిజం, రాష్ట్ర విభజన వంటి సున్నితమైన అంశాలపై పవన్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

Kunamneni Sambasiva rao: తెలంగాణ రాజకీయాల్లోకి ఎందుకు?

తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ కల్యాణ్ ఒక అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారని కూనంనేని విమర్శించారు. “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అని కమ్యూనిస్టులు చెబితే… “విడిపోండి” అని అన్నట్లుగా పవన్ మాట్లాడటంపై మండిపడ్డారు. అనవసరంగా ఈ విషయాల్లోకి కమ్యూనిస్టులను ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఇంత అకస్మాత్తుగా, దూకుడుగా ప్రవేశించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ప్రాంతీయ విద్వేషాలు రేపొద్దు!

రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్ ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెస్తున్నారని కూనంనేని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే వచ్చి సవాళ్లు విసరడం వెనుక ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర దాగి ఉందన్నారు. పవన్ తన రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్య సెంటిమెంట్లను వాడుకుంటున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజున రక్తదాన శిబిరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha