Dailyhunt
పవర్ ప్లేనే మా పతనాన్ని శాసించింది: హార్దిక్ పాండ్యా విశ్లేషణ

పవర్ ప్లేనే మా పతనాన్ని శాసించింది: హార్దిక్ పాండ్యా విశ్లేషణ

వార్త 1 week ago

MI vs CSK Match Highlights: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక, ముంబై కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

దీనితో 103 పరుగుల భారీ తేడాతో ముంబై పరాజయాన్ని మూటగట్టుకుంది. సొంత గడ్డపై సమష్టిగా విఫలమవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

Read Also: MI vs CSK live score: ముంబైపై చెన్నై గెలుపు.. ఐదో స్థానానికి చేరిన రుతురాజ్ సేన

మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశారు. “భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు పవర్ ప్లేలో మెరుగైన ఆరంభం చాలా ముఖ్యం. కానీ పవర్ ప్లేలోనే మేం మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లో వెనుకబడిపోయాం. అక్కడి నుంచీ మేం కోలుకోలేకపోయాము” అని పాండ్యా పేర్కొన్నారు. పిచ్ లేదా వాతావరణం గురించి సాకులు చెప్పడం తనకు నచ్చదని, తాము బ్యాటింగ్‌లో విఫలమయ్యామని నిజాయితీగా అంగీకరించారు.

MI vs CSK Match Highlights: సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్: ప్రత్యర్థిపై ప్రశంసలు

సిఎస్కే బ్యాటర్ల ప్రదర్శనను హార్దిక్ కొనియాడారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని తెలిపారు. సిఎస్కే బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్కోరు బోర్డును పరుగెత్తించారని, ఇది తమపై ఒత్తిడి పెంచిందని అన్నారు. అదే వికెట్‌పై స్పిన్నర్లకు పట్టు దొరికినప్పటికీ, సిఎస్కే బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొని 207 పరుగుల భారీ స్కోరు సాధించారని ప్రశంసించారు.

తప్పులను సరిదిద్దుకుంటాం: వచ్చే మ్యాచ్‌లపై ఫోకస్

వరుస పరాజయాల నేపథ్యంలో జట్టులో చేయాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తామని హార్దిక్ తెలిపారు. “మా తదుపరి మ్యాచ్‌కు కొన్ని రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్‌లో మా తప్పిదాలపై దృష్టి పెడతాం. తుది జట్టులో చేయాల్సిన మార్పుల గురించి యాజమాన్యంతో చర్చిస్తాం” అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా పుంజుకుంటామనే ధీమాను వ్యక్తం చేశారు.

 MI vs CSK IPL 2026 Highlights Hardik Pandya Post Match Interview

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ అకీల్ హోసేన్ ధాటికి ముంబై బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (36), తిలక్ వర్మ (37) కాసేపు పోరాడినా, వీరిద్దరూ ఔటయ్యాక మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్లలో అకీల్ హోసేన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.

అంతకుముందు, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21) నుంచి కొంత సహకారం లభించింది. ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సాఫ్ టోర్నీ నుంచి పాకిస్థాన్ మహిళా జట్టు ఔట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha