Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PBKS చేతిలో చిత్తైన ముంబై

PBKS చేతిలో చిత్తైన ముంబై

వార్త 2 months ago

పీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. సొంత గడ్డపై జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో ముంబై ఘోర పరాజయాన్ని చవిచూసింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయం సరైనదని పంజాబ్ బౌలర్లు నిరూపించారు. ముఖ్యంగా పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. తన రెండో ఓవర్‌లోనే వరుస బంతుల్లో ర్యాన్ రికెల్టన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను డకౌట్ చేయడంతో వాంఖడే స్టేడియం నిశ్శబ్దమైపోయింది. కేవలం 12 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడగా, అర్ష్‌దీప్ (3 వికెట్లు) తన స్వింగ్‌తో ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

Read Also : BJP vs Congress: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

డికాక్ వీరోచిత సెంచరీ – ఒంటరి పోరాటం

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఓపెనర్ క్వింటన్ డికాక్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. నమన్ ధీర్‌తో కలిసి మూడో వికెట్‌కు 122 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో లభించిన లైఫ్ లైన్‌ను నమన్ ధీర్ (50) చక్కగా ఉపయోగించుకున్నాడు. అయితే మరోవైపు డికాక్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన డికాక్, ఈ సీజన్‌లో రెండో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 112 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడటంతో ముంబై 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.

బౌలింగ్ వైఫల్యం.. పంజాబ్ విజయం

196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లకు ముంబై బౌలర్లు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు. ముంబై బ్యాటర్లు కష్టపడి స్కోరు సాధిస్తే, బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ మార్పులు మరియు వ్యూహాలు పంజాబ్ జోరును అడ్డుకోలేకపోయాయి. వరుస ఓటములతో ముంబై ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారగా, పంజాబ్ ఈ విజయంతో పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

డీ లిమిటేషన్‌పై అఖిలేష్ యాదవ్‌కు అమిత్ షా కౌంటర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha