Dailyhunt
తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

వార్త 6 days ago

BJP vs Congress: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కేవలం వ్యాఖ్యలు కావని, తెలంగాణ అస్తిత్వాన్ని, పోరాటాన్ని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.

తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అత్యంత అజ్ఞానంతో కూడుకున్నవని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ సాక్షిగా ఏర్పాటైన ఒక రాష్ట్రాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం ప్రజాస్వామ్యానికే విఘాతమని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని, తెలంగాణను అవమానించినందుకు తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: Jagga Reddy: సదాశివపేట పట్టణానికి మహర్దశ.. రెండేళ్లలో ఇంటింటికి మంచినీళ్లు!

 Tejasvi Surya Telangana Comments

BJP vs Congress:తెలంగాణ బీజేపీ ఎంపీల మౌనంపై ప్రశ్నలు

రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క కించపరుస్తుంటే, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని పొన్నం నిలదీశారు. తెలంగాణ ఏర్పాటు అనేది దశాబ్దాల పోరాటం, వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితమని గుర్తు చేశారు. తెలంగాణ డీఎన్ఏ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యలను ఖండించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

తేజస్వి సూర్యకు తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన లేదని, ఒక జాతీయ పార్టీ ఎంపీ ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఒక రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం ద్వారా బీజేపీ తన అసలు నైజాన్ని బయటపెట్టుకుందని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఈ వివాదం పార్లమెంట్ లోపల, బయట కూడా మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సంక్షేమ పథకాల అమలుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha