PM Yasasvi Scholarship 2026:ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సరిపడక చదువు మధ్యలో ఆపేస్తున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పిస్తోంది.
పేదరికం కారణంగా ఏ ఒక్కరు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పీఎం యశస్వి స్కీమ్ ద్వారా భారీ సాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు చదువు కొనసాగించడానికి అవసరమైన మొత్తం ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో చదివిన తరగతిలో సాధించిన మార్కులు, కుటుంబ వార్షిక ఆదాయం ఆధారంగా ఈ ఉపకార వేతనం లభిస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవవచ్చు.
Read also: SIR Notices : 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు విచారణకు 'సర్' నోటీసులు
PM Yasasvi Scholarship 2026
అర్హతలు మరియు దరఖాస్తు చేసుకునే విధానం
ఈ ఉపకార వేతనం పొందాలనుకునే వారు కొన్ని నిబంధనలు పాటించాలి. ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ కులాలకు చెందిన భారతీయ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండున్నర లక్షల రూపాయలకు మించకుండా ఉండాలి. ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన టాప్ క్లాస్ పాఠశాలల్లో చదువుతున్న వారు మాత్రమే ఈ స్కాలర్షిప్ పొందడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
PM Yasasvi Scholarship 2026:ముఖ్యమైన వివరాలు మరియు చివరి తేదీ
- పీఎం యశస్వి స్కాలర్షిప్ దరఖాస్తు చేయడానికి ఆగస్టు 31 చివరి తేదీగా నిర్ణయించారు.
- తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఏటా ఏటా రూ.75 వేల నుంచి రూ.1,25,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది
- ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంవత్సరానికి లక్షా ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది.
- ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.
- మొత్తం స్కాలర్షిప్ లలో ముప్పై శాతం బాలికలకు కేటాయించడం విశేషం.
- కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తదితర పత్రాలు అవసరం.
- పాఠశాల నోడల్ అధికారి ధ్రువీకరణ తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు.
- దరఖాస్తుల కొరకు అధికారిక వెబ్సైట్ https://scholarships.gov.in సంప్రదించాలి.
Epaper: epaper.vaartha.com

