TG Police Jobs : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే మరో భారీ తీపి కబురు అందించేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు శాఖను బలోపేతం చేసే లక్ష్యంతో..
పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000కు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా, తొలి విడత కింద సుమారు 5,000 కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల అత్యవసర భర్తీ కోసం పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆర్థిక శాఖకు అధికారిక ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ నుంచి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. క్లియరెన్స్ లభించిన వెంటనే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు.
Read Also : ఇందిరమ్మ స్కిం ఫేజ్-2 గైడ్లైన్స్ !

TG Police Jobs: మోడ్రన్ పోలీసింగ్‌పై ఫోకస్
ఈసారి చేపట్టబోయే పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో సాంకేతికత, ఆధునిక రక్షణ విభాగాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ (TGCSB), అత్యంత కీలకమైన ‘ఈగల్ ఫోర్స్’ విభాగాలను బలోపేతం చేయడమే ఈ రిక్రూట్‌మెంట్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న శైలి దర్యాప్తు సామర్థ్యం ఉన్న యువతను ఈ విభాగాల్లోకి పెద్ద ఎత్తున తీసుకోనున్నారు. ఒకవైపు సాధారణ పోలీసింగ్‌ను మెరుగుపరుస్తూనే, మరోవైపు డిజిటల్ నేరగాళ్ల ఆట కట్టించేలా ప్రత్యేక బలగాలను సిద్ధం చేయనుండటంతో ఈ నోటిఫికేషన్ కోసం పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

