Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ స్కిం ఫేజ్-2 గైడ్లైన్స్ !

ఇందిరమ్మ స్కిం ఫేజ్-2 గైడ్లైన్స్ !

వార్త 2 weeks ago

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం రెండో దశ (Phase-2) ప్రారంభానికి గైడ్‌లైన్స్ విడుదలయ్యాయి.

ఈ విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా జీవోను కూడా జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధి మినహాయించి, రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాలకు ప్రాథమికంగా 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించారు. ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు, లబ్ధిదారుల క్షేత్రస్థాయి పరిశీలన మరియు వెరిఫికేషన్ బాధ్యతలను గెజిటెడ్ అధికారులకు అప్పగించడం విశేషం. ముఖ్యంగా నిరుపేదలైన, పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికే ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత (Top Priority) ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also : మహిళా సంఘాలకు రూ.2.18 కోట్ల రుణాలు.. రామాయంపేటలో ఘన లోన్ మేళా

 Indiramma Indlu Scheme

జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

సొంతింటి కల ఉన్న నిరుపేదలకు భరోసా కల్పించేలా, ఇప్పటికే ఇళ్లు ఉండి పైన స్లాబ్ లేని (అసంపూర్తిగా ఉన్న) ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఈ నిధులతో లబ్ధిదారులు తమ ఇళ్లను పూర్తి స్థాయి శాశ్వత భవనాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీన ఏఐసీసీ సమ్మేళన ప్రాంగణం (ASF) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ సరికొత్త మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో నిరుపేద కుటుంబాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జేబులో పేలిన ఫోన్..!!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha