Dailyhunt
పెద్దలు కుదిర్చిన పెళ్లికి శ్రుతి హాసన్ గ్రీన్ సిగ్నల్!

పెద్దలు కుదిర్చిన పెళ్లికి శ్రుతి హాసన్ గ్రీన్ సిగ్నల్!

వార్త 2 weeks ago

Shruti Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ తనయ, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రుతి హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె సినిమాల కంటే వ్యక్తిగత విషయాల వల్ల, ముఖ్యంగా పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

Read Also:Kalyani Priyadarshan: కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తపై తల్లి లిస్సీ క్లారిటీ

Shruti Haasan: వరుడి వేటలో కమల్ హాసన్.. నెట్టింట వైరల్ వార్తలు!

శ్రుతి హాసన్ కెరీర్ పరంగా ఇప్పుడు కాస్త నెమ్మదించారు. రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో మెరిసిన తర్వాత ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటన ఏదీ రాలేదు. అయితే, వెండితెరపై సైలెంట్‌గా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం శ్రుతి పెళ్లి వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

 Shruti Haasan arranged marriage rumors

ప్రేమ వైఫల్యాల తర్వాత కొత్త నిర్ణయం?

శ్రుతి హాసన్ గతంలో లండన్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో సుదీర్ఘ కాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ ప్రేమాయణం సాగించారు. అయితే ఈ రెండు బంధాలు బ్రేకప్‌తో ముగిశాయి. దీంతో ఇప్పుడు ప్రేమ వివాహం కాకుండా, అరేంజ్డ్ మ్యారేజ్ (పెద్దలు కుదిర్చిన పెళ్లి) వైపు శ్రుతి మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఆమె కోసం వరుడిని వెదికే పనుల్లో తండ్రి కమల్ హాసన్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూశారని, అయితే పెద్దగా వర్కవుట్ అవ్వలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్‌కు పెళ్లి చేయాలని కమల్ హాసన్‌ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కాగా శ్రుతి హాసన్ పెళ్లి వార్తలు వైరల్ కావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి వార్తలు రాగా అవన్నీ రూమర్లేనని తేలిపోయాయి. ఇప్పుడీ మళ్లీ శ్రుతి పెళ్లి వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నేటి తరాన్ని పలకరిస్తున్న కోక్ స్టూడియో భారత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha