Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తపై తల్లి లిస్సీ క్లారిటీ

కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తపై తల్లి లిస్సీ క్లారిటీ

వార్త 2 months ago

Kalyani Priyadarshan: మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

వీరిద్దరూ కలిసి నటించిన హృదయం, వర్షంగళ్క్కు శేషం చిత్రాల్లో వారి కెమిస్ట్రీ చూసిన అభిమానులు, ఈ రీల్ లైఫ్ జంట రియల్ లైఫ్‌లో కూడా ఒకటి కావాలని ఆకాంక్షించారు. దీనికి తోడు ప్రియదర్శన్ తన వందో చిత్రాన్ని మోహన్ లాల్‌తో చేస్తున్నట్లు ప్రకటించడంతో, వీరిద్దరూ త్వరలో వియ్యంకులు కాబోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.

Read Also: Regina Cassandra: నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా బాధ తప్పలేదు: రెజీనా కాసాండ్రా ఎమోషనల్

 Mother Lissy is clear on Kalyani’s wedding news.

Kalyani Priyadarshan: అవన్నీ అబద్ధాలే.. క్లారిటీ ఇచ్చిన లిస్సీ

ఈ పుకార్లు మరీ శృతి మించుతుండటంతో కళ్యాణి తల్లి, సీనియర్ నటి లిస్సీ స్పందించారు. మలయాళ పండుగ ‘విషు’ సందర్భంగా ఆమె పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌పై అభిమానులు కళ్యాణి-ప్రణవ్ పెళ్లి గురించి ప్రశ్నించగా.. “అవన్నీ ఫేక్ న్యూస్” అంటూ లిస్సీ కొట్టిపారేశారు. ప్రస్తుతం కళ్యాణి దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పుడప్పుడే వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టం చేయడంతో ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి మూవీ ప్రారంభం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha